Mani Ratnam And Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి ని మించిన దర్శకుడు మరొకరు లేరనే చెప్పాలి. బాహుబలి (Bahubali) సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఈ సినిమా మీద తన పూర్తి ఫోకస్ ని పెట్టాడు. పాన్ వరల్డ్ లో జేమ్స్ కామెరూన్ (James Cameroon) లాంటి స్టార్ డైరెక్టర్ పక్కన తన పేరును నిలుపుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయన ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా పాన్ వరల్డ్ స్థాయికి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ వెళ్లడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.
Also Read: అందువల్లే టెస్ట్ కెప్టెన్సీ తీసుకోలేదు.. ఇన్నాళ్లకు అసలు విషయం చెప్పిన బుమ్రా
ఇక రాజమౌళి (Rajamouli) లాంటి దర్శకుడు ఏ సినిమా చేసిన కూడా అందులో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇప్పుడు చేయబోతున్న ఈ సినిమా విషయంలో కూడా అలాంటి ఒక క్లారిటీ ఇస్తు ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న మణిరత్నం (Manirathnam) లాంటి దర్శకుడు సైతం మహేష్ బాబుతో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అనుకోని కారణాల వల్ల అది వర్కౌట్ కాలేదు. ఇక ఆ సినిమాని దుల్కర్ సల్మాన్ (Dulkar Salman) తో ఒకే బంగారం (Oke Bangaram) అనే పేరుతో మణిరత్నం సినిమా చేశాడు.
మొత్తానికైతే అది ముందు మహేష్ బాబు కోసం అనుకున్న కథ అని పలు సందర్భాల్లో వివరించాడు. ఇక ఏది ఏమైనా కూడా మణిరత్నం మరోసారి కూడా మహేష్ బాబుతో సినిమా చేయడానికి ప్రయత్నం చేసినప్పటికి అది వర్కౌట్ కాలేదు…మరి ఫ్యూచర్లో వీళ్ళ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక రీసెంట్ గా మణిరత్నం కమల్ హాసన్ ను హీరోగా పెట్టి చేసిన ‘థగ్ లైఫ్’ (Thag Life) అనే సినిమా చేశాడు. ఈ మూవీ కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది…