Anora : 97వ ఆస్కార్ అవార్డ్స్(97th Oscar Awards) ప్రధానోత్సవం లో ఏకంగా 6 క్యాటగిరీలలో నామినేషన్స్ ని సంపాదించి సంచలనం సృష్టించిన చిత్రం ‘అనోరా'(Anora Movie). సీన్ బేకర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో మైకీ మ్యాడిసన్(Mikey Madison) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో వేశ్యల జీవితాలను వెండితెర పై చూపించారు. కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రం బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ ఒరిగిన స్క్రీన్ ప్లే , బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ క్యాటగిరీలలో ఈ చిత్రం నామినేషన్స్ ని సొంతం చేసుకుంది. ఇన్ని క్యాటగిరీలలో ఈ ఏడాది ‘అరోరా’ తప్ప మరో సినిమా నామినేట్ అవ్వలేదు. వీటిలో కచ్చితంగా బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ క్యారగిరీలలో అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అద్భుతమైన స్క్రీన్ ప్లే, హృదయాలను హత్తుకునే ఎమోషనల్ డ్రామా ఉన్నటువంటి ఈ చిత్రం ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది.
ఈ నెల 17 నుండి ఈ చిత్రాన్ని మనం జియో హాట్ స్టార్ లో వీక్షించవచ్చు. అదే విధంగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ వినియోగదారులకు రెంట్ రూపం లో అందుబాటులోకి రానుంది. కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే కాకుండా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. కానీ ఒకేసారి అన్ని భాషల్లోకి అనువదిస్తారా లేదా ముందుగా ఫారిన్ భాషల్లో విడుదల చేసి, కొన్ని రోజుల తర్వాత మన ఇండియన్ భాషల్లోకి అనువదిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే వేశ్యల జీవితాలను ఆధారంగా చేసుకొని గతంలో ‘గంగూబాయి’ అనే హిందీ చిత్రం విడుదలైంది. అలియా భట్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ‘అనోరా’ చిత్రం కూడా ఇంచుమించు అదే లైన్ మీద తెరకెక్కిన సినిమా, కచ్చితంగా మన ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన మైకీ మ్యాడిసన్ వయస్సు కేవలం పాతికేళ్ళు మాత్రమే. చేసింది తక్కువ సినిమాలే అయినా, హాలీవుడ్ లో యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. నిన్న ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ ప్రకటించినప్పటి నుండి ఈమె పేరు ని ప్రపంచవ్యాప్తంగా గూగుల్ లో వెతకడం మొదలు పెట్టారు. ఆమెకి సంబంధించిన ఫోటోలు, ఆమె సాధించిన విజయాల గురించి నెటిజెన్స్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ బాగా వైరల్ చేస్తున్నారు.