
Singer Nagaraju: ‘అన్నం ఉడికిందనడానికి ఒక్క మెతుకును పరిశీలిస్తే చాలంటారు..’ అలాగే సింగర్ గా గుర్తింపు రావడానికి ఒక్క పాట హిట్టయితే చాలని సినీ ఇండస్ట్రీలో అనుకుంటారు. అలా ఒకే ఒక్క సాంగ్ తో ఫేమస్ అయిన గాయకులు ఎంతోమంది ఉన్నారు.. ఇప్పటికీ కొనసాగుతున్నారు. 15 ఏళ్ల కిందట ‘అనిత.. ఓ అనిత’ అనే ప్రైవేట్ సాంగ్ సంచలనం సృష్టించింది. ఏనోటా విన్నా.. ఎక్కడ చూసినా.. ఈ పాటే వినిపించేది. అయితే ఈ పాట ఓ వ్యక్తి రియల్ గా పడిన వేదన నుంచి పుట్టుకొచ్చిందని అప్పట్లోనే సింగర్ చెప్పాడు. తన జీవితంలో జరిగిన సంఘటనే పాట రూపంలో చూపించానని అన్నాడు. ‘అనిత’ సాంగ్ తో ఫేమస్ అయిన ఆయన ఆ తరువాత సినిమాల్లో పెద్ద సింగర్ అవుతారని అనుకున్నారు. కానీ అతని జీవితం దుర్భరంగా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కష్టాలు చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆయన ఎలా ఉన్నాడో మీరే చూడండి.
‘నా ప్రాణమా..’ అంటూ పల్లవితో మొదలుపెట్టిన ‘అనిత.. ఓ అనిత’ సాంగ్ రచించి పాడిన వ్యక్తి పేరు నాగరాజు. 1990లో ఈ ప్రైవేట్ సాంగ్ సీడీల్లో, అల్బమ్ స్టోర్లలో మారుమోగేది. అప్పట్లో యూ ట్యూబ్ హవా ఉంటే మిలయన్ల కొద్ది వ్యూస్ వచ్చేవి. అయినా ఈ సాంగ్ సీడీలు విపరీతంగా అమ్ముడుపోయాయి. అయితే నాగారాజు ఈ పాటను ఊరికే పాడలేదు. తన గుండెలో ఉన్న బాధను పాట రూపంలో అందరికీ చెప్పానని అంటున్నాడు. తన జీవితంలో జరిగిన విషాదాన్ని ఈ పాట రూపంలో ప్రజెంట్ చేశానని అన్నారు. అయితే 10 ఏళ్ల కిందట ఫేమస్ అయిన నాగరాజు కనుమరుగయ్యారు. కొందరైతే ఆయన చనిపోయారని ప్రచారం చేశారు కూడా.

అయితే ఇటీవల నాగరాజు కొన్ని ఛానెళ్లలో ప్రత్యక్షమయ్యారు. ‘నేను చనిపోలేదు.. బ్రతికే ఉన్నాను’ అంటూ పరిచయం చేసుకున్నారు. 10 ఏళ్ల కిందట ఆయన ‘అనిత’ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కానీ అమ్మాయి వాళ్ల ఇంట్లో ఒప్పుకోకపోవడంతో వీరిద్దరు విడిపోయారు. ప్రియురాలు దూరమైందన్న బాధ తట్టుకోలేక నాగరాజు ఒక దశలో చనిపోదమని అనుకున్నారు. కానీ తన బాధను పాట రూపంలో పదిమందికి తెలియజేశాడు. సాంగ్ ఫేమస్అయింది కానీ నాగరాజు మాత్రం కష్టాల్లోనే కూరుకుపోయారు.
అనిత నుంచి విడిపోయిన తరువాత నాగరాజు దేవిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. అయితే పెద్ద కూమారుడు మూగ, చెవుడు. చిన్న కుమారుడు కూడా పెద్దబ్బాయితో సైగలు చేస్తూ అలాగే మారిపోయాడు. కొన్ని రోజుల పాటు పాన్ షాప్ తో కుటుంబాన్ని ఈడ్చుకొచ్చిన ఆయన కొందరికి పాటలు రాసిచ్చేవాడు. ప్రస్తుతం అనిత 2 సాంగ్ కోసం రచన మొదలుపెట్టినట్లు ఆయన పేర్కొన్నాడు. విషాద సాంగ్ తో పరిచయం అయిన నాగరాజు నిజ జీవితం కూడా ఇన్ని కష్టాలమయం కావడంతో అందరూ ఆయనపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.