
Ramoji Rao Margadarsi Case: గోద్రా అల్లర్ల కేసును నిజనిర్ధారణ కమిటీ విచారించినప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ సుమారు 18 గంటలు విచారణ కమిటీ ముందు చేతులు కట్టుకొని నిలబడ్డారు. పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు.. అదే కేసులో ప్రస్తుత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గుజరాత్ రాష్ట్ర బహిష్కరణకు గురయ్యారు. ఏడాది పాటు ఢిల్లీలో ఒక చిన్న ఫ్లాట్ లో అద్దెకు ఉన్నారు.. అంటే వ్యవస్థల ఆ రోజున బిజెపి నాయకులు ఏ ధర్నాలు చేయలేదు, ఆందోళనలు చేయలేదు.. వ్యవస్థల మీద గౌరవంతో, వ్యవస్థలు తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించారు. అదే ప్రస్తుతం రామోజీరావుకు చెందిన మార్గదర్శి సంస్థల మీద ప్రస్తుతం ఏపీ సీఐడీ అధికారులు విచారణ నిర్వహిస్తున్నప్పుడు టిడిపి గ్యాంగ్, సో కాల్డ్ మేధావులు, రామోజీరావు అనుకూల వ్యక్తులు ఎలా స్పందిస్తున్నారు చూస్తున్నాం కదా. అసలు మేము కేంద్ర చట్టాలకు అతీతం అని శైలజ చెబుతున్న తీరు ఎలా ఉందో వింటున్నాం కదా.
ఈ కేసు విచారణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగం కీలకపాయింట్ పట్టింది. మా మార్గదర్శి సొక్కం, సుద్ద పూస అని పదే పదే చెప్పుకుంటూ వచ్చిన రామోజీరావు, మిగతా పచ్చ గ్యాంగ్ ఇప్పుడు దెబ్బకు సైలెంట్ అయిపోయింది.. వాస్తవానికి జగన్ ఈ కేసులో ఉన్నట్లు మరింత బిగిస్తున్నాడు. వ్యవస్థలతో ఇన్ని రోజుల పాటు వాడుకున్న రామోజీరావుకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ కేసులో రేపటి నాడు ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే ప్రస్తుతానికైతే రామోజీరావుకు ఉక్కపోత తప్పడం లేదు. ఏపీ సిఐడి అధికారులు మార్గదర్శి సంస్థకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు పరిశీలించినప్పుడు ఆన్ క్లేయిమ్డ్ చెక్కులు ఎక్కువగా వచ్చినట్టు గుర్తించారు. ఇవి రిటర్న్ అయినట్టు కూడా వారి పరిశీలనలో వెల్లడైంది.

వాస్తవానికి ఒక చెక్కు ఖాతాలో అనుకున్నంత స్థాయిలో నగదు లేనప్పుడే రిటర్న్ వస్తుంది. దానిని బ్యాంకు పరిభాషలో చెక్ బౌన్స్ అంటారు. ఇది శిక్షార్హం అవుతుంది. అలాంటప్పుడు గత 17 సంవత్సరాలుగా ఇలాంటి తప్పిదాలకు మార్గదర్శి పాల్పడింది. అయినా వెలుగులోకి రాలేదు. తమ వ్యాపారం వేలకోట్లు ఉంటుందని చెబుతున్న మార్గదర్శి…ఈ అన్ క్లేయిమ్డ్ చెక్కుల విలువ 2,600 కోట్ల వరకు ఉంటుందని ఏపీ సిఐడి అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు ఈ డబ్బులు మొత్తం ఏం చేశారు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.. పైగా చీటీ పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా ఐదు శాతం వడ్డీ ఇస్తామని మార్గదర్శి మభ్యపెడుతోంది. పైగా ఇదేంటని ప్రశ్నిస్తే వారిపై ఒత్తిళ్ళు కూడా చేస్తోందని సమాచారం. అయితే ఇవన్నీ వెలుగులోకి రానీయకుండా చేసి మార్గదర్శి సొక్కమ్ అని కలరింగ్ ఇస్తున్నారు. కానీ అక్రమాలు ఎన్ని రోజులు దాగవు.. వ్యవస్థలతో ఆడుకుంటున్నంత మాత్రాన.. చట్టానికి దొరికిపోరు అనే గ్యారంటీ లేదు. వివేకానంద రెడ్డి హత్య కేసులో, తనపై హత్యాయత్నం కేసులో జగన్ కొంతమేర ఇబ్బంది పడుతున్నప్పటికీ.. రామోజీరావు కేసును మాత్రం అసలు వదిలిపెట్టడం లేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ కు సపోర్ట్ అందిస్తుండడంతో కేసు మరింత రంజుగా మారుతోంది.