
PM Modi- Andhra Media: సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన పుణ్యామా అని ఏపీలో కనుమరుగైంది. పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మిన చందంగా మారింది. జాతీయ పార్టీగా కాంగ్రెస్ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. అటు కేంద్రంలో, ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్లపాటు అధికారం చెలాయించింది. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన పార్టీ కూడా కాంగ్రెసే! అలాంటి ఘనచరిత్ర ఉన్న కాంగ్రెస్‌కి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అడ్రస్ గల్లంతయ్యింది. ఓటు అనే అస్త్రాన్ని ప్రయోగించి ఆ పార్టీని ఏపీ ప్రజలు అథఃపాతాళానికి తొక్కేశారు. ఘనత వహించిన హస్తంపార్టీకి గత ఎన్నికల్లో ఎక్కడా డిపాజిట్లు కూడా దక్కకపోవడం విశేషం. అయినా నిదానంగా ఉన్న ఆ పార్టీకి ఎక్కడో ఆశ. దూరమైన నేతలు, వర్గాలు దగ్గరవుతాయని కొండంత ఆశతో బతుకుతోంది. అయితే ఆ ఆశను బతికించే ప్రయత్నం చేస్తోంది ఏపీ మీడియా. ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుంటూ ఏపీలో కాంగ్రెస్ ను సజీవంగా ఉంచాలని ఎల్లో, నీలి మీడియాలు ప్రయత్నిస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కాంగ్రెస్ కు ఎనలేని ప్రాధాన్యం..
కొంతమంది కాంగ్రెస్ నేతలు అధికారపక్షమైన వైసీపీలోకీ, మరికొందరు టీడీపీలోకీ జంప్ చేశారు. తద్వారా తమ రాజకీయ భవిష్యత్తుని కాపాడుకున్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాన్నే నమ్ముకున్న కొందరు మాత్రం ఇంకా హస్తంనీడలో కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తనంతట తాను ఎదిగే ప్రయత్నం చేయడం లేదు. కానీ అధికారంలో ఉన్న వైసీపీ, విపక్షమైన టీడీపీ ఆ పాత్రను తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎంత ఎదిగితే బీజేపీ అంతలా దిగజారిపోతుందని.. ఏపీలో ఆ పార్టీకి ఉనికి లేకుండా చేయాలన్నదే ఆ రెండు పార్టీల ప్లాన్. తమ బలహీనతలతో ఆడుకుంటున్నందున బీజేపీని సమూలంగా నాశనం చేయడానికి వైసీపీ, టీడీపీలు కంకణం కట్టుకున్నాయి. అందుకు ఒక పద్ధతి ప్రకారం ముందుకెళుతున్నాయి. తమ బలంగా పరిగణించే మీడియా సపోర్టును తీసుకుంటున్నాయి. ఇటీవల జరుగుతున్న పరిణామాల క్రమంలో రాహుల్ గాంధీకి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నాయి. కర్నాటకలో ప్రధాని మోదీ టూర్ కంటే.. అక్కడి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా వార్తకే ఎల్లో మీడియా ప్రయారిటీ ఇచ్చింది. సాక్షిలో కూడా సేమ్ సీన్. కాంగ్రెస్ పార్టీని ధ్వేషించే సాక్షి సడెన్ గా రూటు మార్చం ఏంటా ? అన్న చర్చ ప్రారంభమైంది.
హైకమాండ్ పెద్దలే కారణం..
ఏపీ బీజేపీపై కుట్రలకు హైకమాండ్ పెద్దలే కారణం. జాతీయ రాజకీయాల కోసం ఏపీనే పణంగా పెట్టారన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్రంల అధికారంలో ఉన్న పార్టీలపై పోరాటం చేయాలని పురమాయిస్తూనే.. హైకమాండ్ పెద్దలు మాత్రం వారితో స్నేహం కొనసాగిస్తూ వస్తున్నారు. దీంతో రాష్ట్రం ఏలుబడిలో ఉన్న పార్టీలతో బీజేపీ ములాఖత్ అయ్యిందన్న విపక్షాల ప్రచారాన్ని బలంగా నమ్ముతున్నారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే భావన ప్రజల్లోకి బలంగా వెళ్లిందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. వైసీపీ, బీజేపీ ఒక్కటేనన్న ప్రచారం ప్రజలు నమ్మారని.. అటువంటప్పుడు బీజేపీ అభ్యర్థికి ఓటు వేసినా వృథా అని భావించి ఈ నిర్ణయానికి వచ్చారని బీజేపీ హార్ట్ కోర్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పరిస్థితికి ముమ్మాటికీ హైకమాండ్ పెద్దలు వైఖరే కారణమన్న విశ్లేషణలు నడుస్తున్నాయి.

రెండు పక్షాల స్టాండ్ ఒకటే..
దేశ వ్యాప్తంగా బీజేపీ బలీయమైన శక్తిగా మారింది. ఏపీలో మాత్రం ఆ పార్టీ బలపడకూడదన్నది వైసీపీ, టీడీపీల స్టాండ్. ఈ విషయంలో రెండు పార్టీలు ఒకే ఆలోచనతో ఉన్నాయి. స్నేహం కొనసాగిస్తూనే దెబ్బకొట్టేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. ఇప్పటికే ఆ రెండు పార్టీల వైఖరితో బీజేపీ భారీ మూల్యం చెల్లించుకుంది కూడా. కానీ దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు. ఇప్పుడు ఏపీ మీడియానే తీసుకుందాం. బీజేపీని కార్నర్ చేసుకొని రాతలు ఏపీ ప్రజలను దూరం చేసినట్టే ఉన్నాయి. కానీ బీజేపీ పెద్దలు పట్టించుకోవడం లేదు. అటు ఏపీ మీడియాకు తమ రాజకీయ ప్రయోజనాలున్నాయి. ఈ క్రమంలోనే అవి ప్రధాని మోదీని తక్కువచేసి చూపుతున్నాయి. రాహుల్ గాంధీ బలాన్ని రెట్టింపు చేస్తున్నాయి. అయితే హైకమాండ్ పెద్దలు మాత్రం అదే మీడియా సంస్థలకు అగ్రతాంబూలం ఇస్తుండడంతో రాష్ట్ర బీజేపీ నాయకుల ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు. ఏపీ మీడియా మైండ్ గేమ్ ను అర్ధం చేసుకోవడం లేదు.