Hellenistic Houses: భూమి మీద స్వర్గం అందంటే అందరూ అక్కడికి వాలిపోతారు. కానీ నరకం ఉందంటే అటు వైపు తలెత్తి చూడరు.. నరకం అంటే అందరిలో ఒకటే భయం కలుగుతుంది. జీవితంలో మధురానుభూతి పొందడం అందరికి గమ్మత్తుగా ఉంటుంది. కానీ ప్రాణాలు తీసే నరకం లాంటి ఓ ప్రవేశ ద్వారం ఉందంటే దానికి అందరూ భయపడక తప్పదు. ఇలాంటి ఓ భయోత్పాతం కలిగించే గుహ ఉందంటే నమ్మశక్యం లేదా? కానీ ఇది ముమ్మాటికి నిజమే.

నరకమంటే అందరికీ భయమే. తెలిసి తెలిసి ఎవరు నరకానికి వెళతారు. భూమ్మీదే ఓ నరకం ఉంది. గ్రీకు నగరంలోని హీరాపోలిస్ అనే నరక ద్వారం దాదాపు 2200 సంవత్సరాలుగా అందరిని కలవరపెడుతోంది అక్కడకు వెళ్లేవారు జన్మ చాలించడం మామూలే. రోమన్ సామ్రాజ్యంలో ఉన్న ఈ నగరంలో కొలను, దానికి పక్కనే పొగలు చిమ్ముతూ ఒక గుహలాంటి మార్గం ఉన్నాయి. దీంతో ఈ గుహలోకి వెళితే ప్రాణాలు కోల్పోవడమే. దీంతో అక్కడకు వెళ్లేందుకు అందరు జంకుతుంటారు. నగరంలో ఇలాంటి వేడి నీటి బుగ్గలు చాలా కనిపిస్తాయి.
ఇక్కడ ఫ్లూటో ఆలయం ఉంది. నరకానికి ప్రవేశ ద్వారం కూడా ఇక్కడే ఉండటం గమనార్హం. ఈ ద్వారం దాటి లోపలకు వెళ్లాలంటే ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. దీంతో ఎవరు కూడా అటువైపు వెళ్లేందుకు ధైర్యం చేయడం లేదు. అందుకే దీన్ని గేటు టు హెల్ అని పిలుస్తారు. రోమన్ సామ్రాజ్యంలో పూర్వం రోజుల్లో పూజారులు ఈ ప్రవేశ ద్వారం వద్ద ఎద్దులను బలి ఇచ్చేవారని చెబుతున్నారు. జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ డ్యూయిన్ బర్గ్ ఎసెన్ కు చెందిన శాస్ర్తవేత్త నాలుగేళ్ల కిందట ఈ కట్టడంపై పరిశోధనలు చేశారు.

దీనికి చేరువగా ఎగిరే పక్షులు కూడా చనిపోవడం తెలిసిందే. ఈ గుహ అడుగున ఓ అగ్నిపర్వతం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే దాని దగ్గరకు పోయిన వారు తనువు చాలించాల్సిందే. గుహ ద్వారం నుంచి వెలువడే వాయువుల్లో 91 శాతం కార్బన్ డయాక్సైడ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా లోపల ఉండే రసాయనిక వాయువుల ప్రబావంతోనే కొలనులోని నీటి మట్టం దాదాపు 16 అంగుళాలు ఎత్తుగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతోనే నరక ప్రవేశ ద్వారం గురించి అందరిలో భయాలు నెలకొన్నాయి.