
ఈటీవీ2 లో వచ్చిన ‘పోవే పోరా’ అనే షోతో యాంకర్ గా విష్ణు ప్రియ మంచి ఫాలోయింగ్ ను సంపాదించింది. ఆ షోలో కమెడియన్ సుడిగాలి సుధీర్ తో కలిసి ఈ అమ్ముడు కాలేజీ కుర్రాళ్లతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు..
అంతకుముందు యూట్యూబ్ లో షార్ట్ ఫిలింలు చేస్తూ విష్ణుప్రియ ఓ మోస్తారు క్రేజ్ తెచ్చుకుంది. అలా చాన్స్ దక్కించుకొని బుల్లితెరపై ఎంటర్ టైన్ మెంట్ షోలు చేస్తూ ఇప్పుడు యాంకర్ గా స్థిరపడింది.
యాంకర్ విష్ణు ప్రియ బుల్లితెరపై ఎంత పాపులారిటీ సంపాదించిందో అంతకుమించిన పాపులారిటీ సోషల్ మీడియాలో తెచ్చుకుంది. శ్రీముఖి, విష్ణుప్రియలు కలిసి చేసే డ్యాన్స్ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీరిద్దరూ కలిసి ఆ మధ్య గోవాలో పుట్టించిన సెగల వేడి ఇంకా చల్లారలేదు. గోవాలో అందాలు ఆరబోసిన ఈ పెద్ద ముక్కు సుందరి ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరోసారి డ్యాన్సింగ్ వీడియోతో ఊపుఊపేసింది..
సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ ఫొటో షూట్లు చేస్తూ, వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లకు కన్నులవిందు చేస్తోంది విష్ణుప్రియ. తాజాగా ఓ వీడియోను షేర్ చేసిన విష్ణు ప్రియ తన వయ్యారాలను తెగ తిప్పేసింది. ఒక హిందీ పాటకు లయబద్దంగా యాంకర్ విష్ణు ప్రియ చేసిన డ్యాన్స్ ఉర్రూతలూగించేలా ఉంది. విష్ణుప్రియ ఈ వీడియోలో వేసిన స్టెప్పులు, ఆ ఊపుడు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యాంకర్ విష్ణు ప్రియ వీడియో..