Nidhi Agarwal: నిధి అగర్వాల్ వెంటపడుతున్న స్టార్ హీరోలు..అమ్మడి అదృష్టం మామూలుగా లేదుగా!

Nidhi Agarwal: గడిచిన కొన్నేళ్ల నుండి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతోమంది కుర్ర హీరోయిన్స్ లో మంచి క్రేజ్ మరియు ఫాలోయింగ్ ని సంపాదించుకున్న నటి నిధి అగర్వాల్.అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా ఈ హైదరాబాదీ బ్యూటీ ఇప్పటికీ నటన పరంగా తనని తానూ ప్రూవ్ చేసుకోలేదు కానీ,అందం పరంగా మాత్రం కుర్రకారులను మెంటలెక్కిపోయ్యేలా చేస్తుంది.సోషల్ మీడియా లో ఈమెకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది […]

Written By: Vicky, Updated On : March 16, 2023 10:21 am
Follow us on

Nidhi Agarwal: గడిచిన కొన్నేళ్ల నుండి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతోమంది కుర్ర హీరోయిన్స్ లో మంచి క్రేజ్ మరియు ఫాలోయింగ్ ని సంపాదించుకున్న నటి నిధి అగర్వాల్.అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా ఈ హైదరాబాదీ బ్యూటీ ఇప్పటికీ నటన పరంగా తనని తానూ ప్రూవ్ చేసుకోలేదు కానీ,అందం పరంగా మాత్రం కుర్రకారులను మెంటలెక్కిపోయ్యేలా చేస్తుంది.సోషల్ మీడియా లో ఈమెకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు.

ఆమె పుట్టినరోజు వచ్చిందంటే చాలు అభిమానులు ఆమె పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు.పలుచోట్ల ఆమె విగ్రహాలు కూడా స్థాపించారు ఫ్యాన్స్.అంతటి ఆదరణ దక్కించుకున్న ఈ బ్యూటీ కి మధ్యలో సినిమా అవకాశాలు రావడం బాగా తగ్గిపోయాయి కానీ, ఇప్పుడు మాత్రం వరుసగా చేతినిండా క్రేజీ ప్రాజెక్ట్స్ తో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది.

ఇది వరకు కేవలం కుర్ర హీరోల సినిమాలకు మాత్రమే పరిమితమైన నిధి అగర్వాల్, ఇప్పుడు మన టాలీవుడ్ టాప్ లీడింగ్ స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ వరుసగా కొట్టేస్తుంది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’ అనే చిత్రం లో నటిస్తుంది.ఈ సినిమా ఇప్పుడు చివరి దశకి చేరుకుంది.

ఈ చిత్రం తో పాటుగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ – మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఆమె ఒక హీరోయిన్ గా నటిస్తుంది.ఈ రెండు సినిమాలతో పాటు మరో ఇద్దరి స్టార్ హీరోల సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటిస్తుందట.రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె ఈ విషయాన్నీ చెప్పుకొచ్చింది.ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న నిధి అగర్వాల్, ప్రస్తుతం ఇండస్ట్రీ లో దూసుకెళ్తున్న శ్రీలీల కి పోటీ ఇస్తుందో లేదో చూడాలి.