
Junior NTR- Anchor Suma: బుల్లితెర మీద యాంకరింగ్ రంగం లో సుమారు మూడు దశాబ్దాల నుండి నెంబర్ 1 గా కొనసాగుతున్న సుమ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది.ఈమె లేకుండా ఏ స్టార్ హీరో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ చెయ్యలేదు,ఈమె లేని బుల్లితెర షో అంటూ ఉండదు.ఈ మూడు దశాబ్దాలలో ఎంతో మంది యాంకర్స్ వచ్చారు కానీ, ఒక్కరు కూడా సుమ స్థానానికి చేరుకోలేకపోయారు.సినిమా ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి ఎలాగో, బుల్లితెర మీద యాంకర్ సుమ అలా అన్నమాట.
ఇది ఇలా ఉండగా గత కొంతకాలం క్రితం ఆమె నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన ‘అమిగోస్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.అయితే ఎన్టీఆర్ కి మైక్ ఇచ్చే ముందు #NTR30 మూవీ ప్రస్తావన సుమ తీసుకొస్తుంది.దీనికి ఎన్టీఆర్ చాలా సీరియస్ లుక్ ఇవ్వడం సోషల్ మీడియా లో ఎంత ట్రెండ్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
దీనిపై సుమ ఇన్నాళ్లకు కౌంటర్ ఇచ్చింది.ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ గానే ఆమె హోస్ట్ గా వ్యవహరిస్తూ ఈటీవీ లో ‘సుమ అడ్డా’ అనే కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే.మొదటి ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి గా హాజరు అయ్యాడు.ఇప్పుడు రీసెంట్ ఎపిసోడ్ కి విక్టరీ వెంకటేష్ మరియు రానా దగ్గుపాటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది.అందుకు ప్రొమోషన్స్ లో భాగంగా ఈ ప్రోగ్రాం లో పాల్గొన్నారు.సుమ కాసేపు సరదాగా వెంకటేష్ మరియు రానా తో చేసిన చిట్ చాట్ షో కి హైలైట్ గా నిలవనుంది.రేపు రాత్రి ఈ ఎపిసోడ్ 9 గంటల 30 నిమిషాలకు ఈటీవీ లో టెలికాస్ట్ కానుంది.అయితే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

ఈ ప్రోమో లో సుమ మాట్లాడుతూ ‘మీ వెబ్ సిరీస్ లో చూసినట్టు ఒకసారి నన్ను సీరియస్ గా చూడండి సార్’ అంటుంది, అప్పుడు వెంకటేష్ ఆమె వైపు సీరియస్ గా చూడడం ప్రారంభిస్తాడు, అప్పుడు సుమ ‘ఇక ఆపేయండి సార్, దీని మీద యూట్యూబ్ లో చాలా వస్తాయి..ఏంటో ఈమధ్య హీరోలందరూ నాపై సీరియస్ గా చూస్తున్నారు’ అంటూ ఎన్టీఆర్ కి చురకలు అంటించింది సుమ.