
Anchor Suma: యాంకర్ గా సుమ ప్రస్థానం వివరించాలంటే పెద్ద పుస్తకమే అవుతుంది. రెండు దశాబ్దాలుగా ఆమె బుల్లితెర మీద ఏకఛత్రాధిపత్యం చేస్తున్నారు. యాంకరింగ్ లో సుమ చాలా మందికి రోల్ మోడల్. భాషలపై పట్టు, సమయస్ఫూర్తి, వేగం ఆమెను స్టార్ యాంకర్ చేశాయి. పదుల సంఖ్యలో ఆమె షోలు చేశారు. సుమ యాంకర్ గా ఉన్న షోలు ఏళ్ల పాటు సాగాయి. ఇక సినిమా వేడుకలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్స్… అయితే లెక్కే లేదు. ఓ స్టార్ హీరోయిన్ కి మించిన సంపాదన సుమ సొంతం. ఆమెకు భీభత్సమైన పాపులారిటీ ఉంది.
అయితే సుమ కెరీర్ మొదలైంది నటిగా. ఆమె హీరోయిన్ కావాలనుకున్నారు. పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో సుమ హీరోయిన్ వేషాల కోసం తిరిగారు. ఈ క్రమంలో ఆమెకు లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు ఆఫర్ ఇచ్చారు. ఆమెను హీరోయిన్ చేశారు. 1996లో విడుదలైన కళ్యాణ ప్రాప్తిరస్తు మూవీతో సుమ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి మరో విశేషం ఉంది. కళ్యాణ ప్రాప్తిరస్తు హీరో వక్కంతం వంశీ.
వక్కంతం వంశీ మొదట్లో హీరోగా ప్రయత్నాలు చేశారు. అలా యాంకర్ సుమ-వక్కంతం వంశీ కళ్యాణ ప్రాప్తిరస్తు మూవీలో జంటగా నటించారు. రొమాన్స్ కురిపించారు. అయితే ఈ చిత్రం డిజాస్టర్. ఆ దెబ్బతో వక్కంతం రైటర్ గా టర్న్ అయ్యాడు. కథా రచయితగా మారి సక్సెస్ అయ్యాడు. అల్లు అర్జున్ వక్కంతం వంశీకి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. ఆ మూవీ ఆడలేదు. నితిన్ హీరోగా మరో మూవీ ఆయన దర్శకుడిగా తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక సుమ కళ్యాణ ప్రాప్తిరస్తు తర్వాత రెండు మూడు మలయాళ చిత్రాలు చేశారు. నటిగా సక్సెస్ రాకవపోవడంతో యాంకరింగ్ ని కెరీర్ గా ఎంచుకుని విజయం సాధించారు. స్టార్ యాంకర్ అయ్యాక చిన్న చిన్న క్యామియో రోల్స్ సుమ చేస్తారు. గత ఏడాది జయమ్మ పంచాయితీ చిత్రంలో లీడ్ క్యారెక్టర్ చేశారు. ఆ సినిమా ఆడలేదు. ఏళ్ల తరబడి యాంకరింగ్ చేసి సుమకు బోర్ కొట్టినట్లు ఉంది. ఈ మధ్య షోలు తగ్గించేశారు.