
Cheapest 7 Seater Cars: నేటి కాలంలో చాలా మంది కనీస సౌకర్యాల్లో ‘కారు’ను కూడా చేర్చుకుంటున్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి విహార యాత్రకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇతర వాహనాలను అసౌకర్యంగా భావిస్తున్నారు. అందుకే కొంచెం ఖర్చయినా సొంతంగా కారును కొనుక్కొంటున్నారు. ఇక కరోనా మహమ్మారి తరువాత ఇతరులతో సంబంధం లేకుండా ప్రయాణం చేయాలని అనుకునేవారు కారును తప్పనిసరిగా చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో కార్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. అయితే మొన్నటి వరకు చిన్న ఫ్యామిలీకి అనుగుణంగా, 5గురు వ్యక్తులు మాత్రమే ప్రయాణించే కార్లను కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు 7 సీటర్ కూడా తక్కువ ధరకే అందుబాటులోకి రావడంతో వాటిపై ఆసక్తి చూపుతున్నారు. మరి తక్కువ ధరలో లభించే 7 సీటర్ కార్ల గురించి తెలుసుకుందామా..
మారుతి సుజుకి Ertiga:
దేశంలో అత్యధికంగా అమ్ముడు పోతున్న 7 సీటర్ కార్లలో Ertiga ముందు వరుసలో ఉంది. 1.5 లీటర్ NA పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉన్న ఇందులో 5- స్పీడ్ మాన్యువల్, 6- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కలిగి ఉన్నాయి. 99 bhp పవర్, 136.8 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మారుతి సుజుకి Ertiga షో రూం ధర రూ.8.35 నుంచి రూ.12.79 లక్షల వరకు ఉంది.

కియా కేరెన్స్:
కియా కేరేన్స్ 113 bhp పవర్ తో 1-5 లీటర్ NAపెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. 158 bhp పవర్ తో 1-5 లీటర్ టర్బో చార్జ్ పెట్రోల్ ఇంజిన్, 114 bhp పవర్ ను ఉత్పత్తి చేసే 1-5 లీటర్ డీజిల్ తో పనిచేస్తుంది. ఈ కారు ప్రారంభం ధర రూ.10.45 లక్షల నుంచి రూ.18.95 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

రెనాల్డ్ Triber:
7 సీట్లో దేశంలో ప్రజాధరణ పొందిన కార్లలో Renault Triber ఒకటి. ఇంజన్ 71 bhp శక్తి, 96 NM టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంటుంది. 1.0 లీటర్ NAపెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఈ కారు ధర రూ.6.33 లక్షల నుంచి రూ.8.97 లక్షల వరకు అమ్ముతున్నారు.

మారుతి సుజుకి ఈకో:
7 సీటర్లలో అతి తక్కువ ధరకు లభించే కారు ఇది. 1.2 లీటర్ పెట్రోల్ కె- సిరీస్ పెట్రోల్ ఇంజన్ కలిగి 81 bhp పవర్, 104 NM టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్, CNG ఆప్షన్ తో ఉంటుంది. 5- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో కూడిన దీని ధర రూ.5.25 లక్షల నుంచి రూ.6.51 వరకు ఉంది.

మహీంద్రా Bolero Neo:
98 bhp పవర్, 260 Nm ఉత్పత్తి చేసే మహీంద్రా Bolero Neo 1.5 లీటర్ mHawk డీజిల్ ఇంజన్ ఆప్షన్ ను కలిగి ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కారు ఎక్స్ – షోరూం ధర రూ.9.63 నుంచి రూ.12.14 లక్షల వరకు అందుబాటులో ఉంది.
