
Pawan Kalyan OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క ఇంత బిజీ షెడ్యూల్స్ లో సినిమాలు చేస్తూ మరోపక్క క్రియాశీలక రాజకీయ కార్యకలాపాలను కూడా చూసుకుంటున్నాడు. నిన్న మొన్నటి వరకు డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ మొదటి షెడ్యూల్ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్, ఎల్లుండి నుండి డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించబోయ్యే #OG మొదటి షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు.
ఈ సినిమాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ రేపటి నుండే ప్రారంభం కానుంది,హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ తో పాటుగా మిగిలిన ముఖ్య తారలు రేపు పాల్గొంటారు, పవన్ కళ్యాణ్ ఎల్లుండి నుండి షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు.
ఆస్కార్ అవార్డు గెలుచుకున్న #RRR వంటి సినిమాని తీసిన డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.ఈ ఏడాదిలోనే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి డిసెంబర్ 8 వ తారీఖున ఈ చిత్రాన్ని ఘనంగా విడుదల చెయ్యబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే డైరెక్టర్ సుజిత్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేసాడట.ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క రాజకీయ కార్యకలాపాల్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సిన అవసరం ఉంది. అందుకే షెడ్యూల్స్ ని దానికి అనుగుణంగా ప్లాన్ చేశారట. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ మాఫియా డాన్ గా కనిపించనున్నాడు.

గతం లో మాఫియా బ్యాక్ డ్రాప్ లో పవన్ కళ్యాణ్ నుండి బాలు మరియు పంజా వంటి సినిమాలు వచ్చాయి. ఈ రెండు చిత్రాలు కూడా కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కానీ OG చిత్రాన్ని ప్రపంచం మొత్తం అబ్బురపొయ్యేలా తియ్యబోతున్నాడట డైరెక్టర్ సుజిత్, ఆయన పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అనే విషయం తెలిసిందే. కాబట్టి ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.ఆ నమ్మకాన్ని ఆయన ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.