Megastar Chiranjeevi- Suma: మెగాస్టార్ చిరంజీవికి కోట్లలో అభిమానులు ఉన్నారు. స్టార్స్ కి స్టార్ ఆయన. ఈ తరం హీరోలు సైతం ఆయన్ని అభిమానిస్తారు. ప్రత్యేకంగా గౌరవిస్తారు. ఆయన్ని కలవాలని, మాట్లాడాలని తపించేవారు ఎందరో. మరి అంత గొప్ప వ్యక్తి చిరంజీవి మెసేజ్ పెడితే యాంకర్ సుమ కనీసం రిప్లై ఇవ్వలేదట. అది ఒకసారి కాదు…. వరుసగా మూడేళ్లు జరిగిందట. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా తెలియజేశాడు. వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి ఈ మేరకు వెల్లడించారు. చిరు లీక్స్ ఈ మధ్య ప్రాచుర్యం పొందిన పదం.

చిరంజీవి తన చిత్రాల గురించి, అలాగే గెస్ట్ గా హాజరైన ఇతర చిత్రాల కీలక విషయాలు ఫ్లోలో బయట పెట్టేస్తున్నారు. ఆచార్య టైటిల్ చిరంజీవి అధికారికంగా ప్రకటించకుండానే లీక్ చేశారు. ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఆయన చాలానే చేశారు. ఈ క్రమంలో చిరు లీక్స్ అనే పదం ఫేమస్ అయ్యింది. వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. హోస్ట్ గా ఉన్న సుమ… చిరు లీక్స్ ఏమైనా ఉన్నాయా? అడిగారు. దాంతో నీ గురించి కొన్ని చెప్పాలని షాకింగ్ విషయం బయటపెట్టారు.
సుమకు ప్రతి ఏడాది నేను బర్త్ డే విషెస్ తెలియజేస్తూ మెసేజ్ పెట్టేవాడిని. అయితే ఆమె నాకు కనీసం రిప్లై ఇచ్చేది కాదు. మూడేళ్లలో ఒక్కసారి కూడా నా మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదని చిరంజీవి సరదాగా చెప్పారు. అయితే సుమ కావాలని చేసింది కాదు. బుల్లితెర స్టార్ గా ఆమెకు కూడా లక్షల్లో ఫ్యాన్స్ ఉంటారు. వారిలో చాలా మంది దగ్గర ఆమె ఫోన్ నెంబర్ ఉంటుంది. ఈ క్రమంలో వందల్లో, వేలల్లో ఆమెకు బర్త్ డే విషెస్ సందేశాలు రావచ్చు. చిరంజీవి ఫోన్ నెంబర్ ఐడియా లేని సుమ సాధారణ అభిమానుల్లో ఒకరిగా ఆ సందేశం పక్కన పెట్టేసేదట.

తర్వాత ఓ సందర్భంలో కలిసినప్పుడు చిరంజీవి ఆ విషయం చెప్పడంతో సుమ సారీ చెప్పారట. చిరంజీవి నెంబర్ తీసుకొని సేవ్ చేసుకున్నారట. ఈ విషయాన్ని చిరంజీవి తాజాగా బయటపెట్టారు. ఇక వాల్తేరు వీరయ్య మూవీతో చిరంజీవి భారీ హిట్ కొట్టారు. ఆయన సంక్రాంతి విన్నర్ గా అవతరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో వాల్తేరు వీరయ్య వసూళ్లు దుమ్ముదులుపుతుంది. కే ఎస్ రవీంద్ర వాల్తేరు వీరయ్య చిత్రానికి దర్శకుడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీ సంగీతం అందించారు.