Homeఎంటర్టైన్మెంట్Anchor Suma: ఎంత మోసం... సుమ కోసం కార్చిన కన్నీళ్లన్నీ వేస్ట్ 

Anchor Suma: ఎంత మోసం… సుమ కోసం కార్చిన కన్నీళ్లన్నీ వేస్ట్ 

Anchor Suma: సుమ ఇటీవల యాంకరింగ్ నుండి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీలో ఒక స్పెషల్ ఈవెంట్ రూపొందించారు. బుల్లితెర కమెడియన్స్, యాంకర్స్, జడ్జెస్ అందరూ సదరు షోలో పాల్గొన్నారు. సుమ యాంకర్ గా వ్యవహరించారు. ఏళ్ల తరబడి యాంకర్ గా ఎంటర్టైన్ చేసిన సుమ గారిని సన్మానించుకుందాం… అని హైపర్ ఆది అన్నారు. ఆమెకు పూలగుచ్చం ఇచ్చి శాలువా కప్పి గౌరవించారు. ఈ సందర్భంగా ఆమె కన్నీరు పెట్టుకున్నారు. నేను మలయాళీ అమ్మాయిని అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరించారు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే తెలుగు ఆడియన్స్ ప్రేమాభిమానాలే కారణం అన్నారు. అందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చారు.

Anchor Suma
Anchor Suma

ఈ సందర్భంగా యాంకరింగ్ కి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. బిజీ షెడ్యూల్స్ కారణంగా నేను కుటుంబంతో గడపలేకపోతున్నాను. అసలు తినడానికి, పడుకోవడానికి మాత్రమే ఇంటికి వెళుతున్నట్లు నా జీవితం ఉంది. భర్త, పిల్లలతో ఆనందంగా గడిపే తీరిక, సమయం లేకుండా పోతుంది. నా ఫ్యామిలీని నేను బాగా మిస్ అవుతున్నాను. అందుకే కొన్నాళ్ల పాటు బుల్లితెరకు దూరం అవుతున్నాను… అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆమె అంత ఎమోషనల్ గా చెప్పగానే నిజమే అనుకున్నారు.

కట్ చేస్తే ‘సుమ అడ్డా’ అని కొత్త షోతో దిగిపోయింది. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ఆమెతో సరికొత్త టాక్ షో ప్రారంభించినట్లు తెలుస్తుంది. అలీ-పోసాని, శేఖర్ మాస్టర్-జానీ మాస్టర్ తో పాటు కళ్యాణం కమనీయం టీమ్ ఆమె షోలో పాల్గొన్నారు. సుమ తన మార్క్ ఎనర్జీతో షోను పరుగులు పెట్టించారని అర్థం అవుతుంది. అయితే సుమ యాంకరింగ్ నుండి విరామం తీసుకుంటున్నాను, కొన్నాళ్ళు బుల్లితెరపై కనిపించను అనగానే… అభిమానులు కన్నీటి పర్యంతం అయ్యారు. మేడం మీరు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఎప్పటికీ మీరు బుల్లితెరపై మాటల జలపాతంలా గలగలా పారాలి అని కోరుకున్నారు.

Anchor Suma
Anchor Suma

వాళ్ళ ఏడుపుకు, ఎమోషన్ కి సుమ విలువ లేకుండా చేసింది. బ్రేక్ అని చెప్పి కొత్త షో స్టార్ట్ చేసింది. సుమ తీరుకు అందరూ నివ్వెరపోయారు. సుమ ఇచ్చిన షాక్ తర్వాత బుల్లితెర షోలలో చేసే వాగ్దానాలు నమ్మకూడదని జనాలు ఫిక్స్ అయ్యారు. కేవలం ఆ ఎపిపోడ్ కి హైప్ తేవడం కోసం ఎలాంటి కామెంట్స్ అయినా చేస్తారు? జనాలను తప్పుదోవబట్టిస్తారని క్లారిటీ వచ్చింది. ఇకపై ఈ టీవీ జనాల ఎమోషన్స్ కి మనం కనెక్ట్ కాకూడదని ఫిక్స్ అయ్యారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version