China Covid Cases: ఎవడు చేసిన పాపాన్ని వాడే అనుభవించాలి.. కర్మ సిద్ధాంతం ఇదే చెబుతోంది. ఇప్పుడు చైనా కూడా చేసిన పాపాన్ని వడ్డీతో సహా అనుభవిస్తోంది. చైనా యోహన్ ల్యాబ్ లో పుట్టిన కోవిడ్ వైరస్ 2020, 2021 సంవత్సరాల్లో ప్రపంచాన్ని ఎంత ఇబ్బందులకు గురి చేసిందో అందరికీ తెలుసు. అధికారిక లెక్కల ప్రకారమే 60 లక్షల పై చిలుకు జనం కోవిడ్ వల్ల చనిపోయారని సమాచారం.. అనధికారిక లెక్కలు కూడా కలిపితే ఈ సంఖ్య కోటి పైచిలుకు ఉండే అవకాశం ఉంది.. ఇంతటి ఉత్పతానికి ప్రధాన కారణం చైనా ప్రపంచం మీదకు వదిలిన కోవిడ్ వైరసే. దీని ప్రభావం వల్ల వేలాదికోట్ల నష్టం, లక్షలాది ప్రజల ప్రాణనష్టం సంభవించాయి. పోనీ దీనివల్ల చైనా బావుకున్నది కూడా ఏమీ లేదు.

ఇప్పుడు ఫలితం అనుభవిస్తోంది
ప్రపంచం మొత్తం కోవిడ్ తగ్గు ముఖం పడితే చైనాలో మాత్రం విజృంభిస్తోంది.. బయటకు చెప్పడం లేదు కానీ రోజుకు వేలాది కేసులు నమోదవుతున్నాయి. మొన్నటిదాకా జీరో కోవిడ్ పాలసీ పేరుతో దేశాన్ని మొత్తం అష్టదిగ్బంధనం చేసిన అక్కడి ప్రభుత్వం… ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కాగానే కోవిడ్ సడలింపులు ఇస్తోంది.. దీనివల్ల మళ్లీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.. బీజింగ్, శాంగై వంటి నగరాల్లో రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. 2020, 2021 లో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నాయో… ఇప్పుడు చైనాలో అంతకుమించి ఉంది. ప్రాణాలు పోతున్నాయి.. అయినప్పటికీ ఆ వివరాలు బయటకు చెప్పేందుకు చైనా ఇష్టపడటం లేదు.
హ్యాక్ చేసింది
మందిని ముంచి ఆస్తులు పెంచడంలో చైనా దేశం తర్వాతే ఎవరైనా. కోవిడ్ నివారణకు వ్యాక్సిన్ కనుగొనలేని దుస్థితిలో ఉన్న ఆ దేశం.. మనదేశంలోని ఎయిమ్స్, ఐసీ ఎం ఆర్ సర్వర్లను హ్యాక్ చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి కీలకమైన సమాచారాన్ని తస్కరించేందుకు విఫల ప్రయత్నం చేసింది.. తన దేశం నుంచి చేస్తే అనుమానం వస్తుందని… తైవాన్ నుంచి ఈ దుర్మార్గానికి తెరలేపింది.

ఏ స్థాయిలో ఉందంటే..
చైనాలో ప్రస్తుతం కోవిడ్ విజృంభణ తారాస్థాయికి చేరింది.. రోజుకు వేలాది కేసులు నమోదు అవుతున్నాయి. జీరో కోవిడ్ పాలసీని ప్రభుత్వం ఎత్తేయడంతో కేసులు అసాధారణ స్థాయిలో పెరుగుతున్నాయి. దేశంలో సుమారు 60 శాతం మందికి కోవిడ్ ప్రబలే ప్రమాదం ఉన్నట్టు ప్రపంచ వైద్య నిపుణులు చెబుతున్నారు.. ఇది ప్రపంచ జనాభాకు ఆరు శాతం సమానమని వారు వెల్లడిస్తున్నారు.. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ వ్యాక్సిన్ ప్రజలకు వేయడంలో అక్కడి ప్రభుత్వం ఎడతెగని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇతర దేశాల సరిహద్దుల్లోకి చర్చికి వచ్చేందుకు అక్కడి పాలకులు ప్రయత్నిస్తున్నారంటే వారి దుర్బుద్ధి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. జపాన్ సరిహద్దునను కబళించేందుకు ప్రయత్నిస్తున్న చైనా.. భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం సరిహద్దు గ్రామాల్లో నిర్మాణాలు ప్రారంభిస్తున్నది. ఇక ఆస్ట్రేలియా వైద్యులు చేసిన పరిశోధన ప్రకారం చైనా దేశస్తుల్లో వ్యాధి నిరోధక శక్తి అతి తక్కువగా ఉంటుందని వెల్లడించారు.. పైగా వారి ఆహారపు అలవాట్లు అత్యంత అధ్వానంగా ఉంటాయని వాపోయారు.. చైనాలో కోవిడ్ వ్యాప్తికి 50% వైరస్, మిగతా 50% అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లని తేల్చిపడేశారు.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే చైనా జీరో కోవిడ్ పాలసీ పెట్టినా పెద్ద ఉపయోగం ఉండదని వారు వ్యాఖ్యానించారు. అందుకే పెద్దలన్నారు చెరపకురా చెడేవు అని…ఆ మధ్య ప్రపంచాన్ని చెరపాలని చైనా అనుకున్నది.. కానీ తాను ఇప్పుడు కోవిడ్ వల్ల పూర్తిగా చెడిపోతోంది.