Anchor Anasuya : ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో కి యాంకర్ గా పని చేసి మంచి క్రేజ్ సంపాదించుకున్న అనసూయ, ఇప్పుడు సినిమాల్లో కూడా బిజీ ఆర్టిస్టుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం ఉన్నప్పటికీ ఈమెకి డైరెక్టర్స్ ఎక్కువగా నెగటివ్ రోల్స్ ఇస్తూ ఉంటారు.సోషల్ మీడియా లో అందరూ ఈమెని జూనియర్ అనుష్క అని పిలుస్తూ ఉంటారు.
ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ అభిమానులతో పంచుకునే అలవాటు ఉన్న యాంకర్ అనసూయకి, అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ట్రోలింగ్ కి గురి అవుతూ ఉంటుంది.ఎవరైనా ఈమెని ఆంటీ అని పిలిస్తే చాలు,వెంటనే ఫైర్ అయ్యిపోతాది, మీ మీద పోలీస్ కేసు పెడుతా అంటూ బెదిరింపులు చేస్తాది,అలా సోషల్ మీడియా లో ఆమె నెటిజెన్స్ తో ఎన్నోసార్లు గొడవలు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.
అయితే ఆమె అప్పుడప్పుడు అప్లోడ్ చేసే ఫోటోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంటాయి.రీసెంట్ గా ఆమె తన నిశ్చితార్థం సమయం లో కట్టుకున్న చీరతో , వివిధ యాంగిల్స్ లో ఫోటోలు దిగి సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ ’15 సంవత్సరాల క్రితం నా నిశ్చితార్థం కోసం కట్టుకున్న చీర ఇది,ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ ఇదే కట్టుకోవడం’ అంటూ ఆమె షేర్ చేసిన ఫోటోలు నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
36 ఏళ్ళ వయస్సు వచ్చినా కూడా అందం ఏమాత్రం తగ్గలేదని,నీ అందం ముందు ఇప్పుడొస్తున్న కొంత మంది కుర్ర హీరోయిన్స్ కూడా సరితూగరు అంటూ నెటిజెన్స్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.మరి దీనికి ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.ప్రస్తుతం ఈమె స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప : ది రూల్ లో నటిస్తుంది.