
TDP Media : ప్రజాస్వామ్యంలో పత్రికలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతిపక్ష పాత్ర పోషిస్తాయనే నానుడి కూడా ఉంది. ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయడంలోను, సమస్యలను వెలికితీయడంలోను ముందుటాయి. అటువంటి పత్రికలపై రాజకీయ ఆరోపణలు రావడం విచారకరం. ఏపీలో పచ్చమీడియాగా పేరొందిన ఆంధ్రజ్యోతి, ఈనాడు అన్ని తమకు అనుకూలంగా అన్ని జరగాలన్న ధోరణిలో రాతలు ఉంటాయి. దీనిపై అధికార పార్టీ నేతలు మండిపడటంలో పెద్దగా తప్పు కనిపించదు.
వైసీపీ ప్రభుత్వం, జగన్ పై వ్యతిరేకంగా కథనాలు ప్రచురించడంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి ముందుంటుందనడంలో సందేహం లేదు. ఆ విషయంలో మోతాదు కాస్తా ఎక్కువగానే ఉంటుంది. రాధాకృష్ణ తనకంటూ ఆదివారం కేటాయించిన ‘‘కొత్తపలుకు’’లో ఎన్నో ప్రస్తావించే ఎన్నో విషయాలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అలర్ట్ చేస్తున్నట్లు చెబుతూనే అది చదవిని వారి మనసులు మారిపోయేలా రాతలు ఉంటాయి. ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే ఇంతలా దిగజారిపోవాలా అన్నట్లు కామెంట్లు కూడా వస్తుండటం కొసమెరుపు.
గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరికృష్ణ చెదోడు వాదోడుగా ఉండేవారు. ఆ తరువాత విభేదించి చంద్రబాబు పక్కన చేరినప్పడు.. పచ్చ మీడియాలో ‘‘రథసారధులు’’ అని పతాక శీర్షికలతో కథనాలు వచ్చాయి. పత్రికలు న్యూటల్ గా ఉండాల్సిందిపోయి తాము అనుకున్న వారికి (చంద్రబాబు) మాత్రమే అనుకూలంగా వార్తలు ప్రచురించడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆ తరువాత హరికృష్ణను ఎమ్మెల్యే, ఎంపీ వరించనున్నాయని వార్తలు వేశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అది కొద్ది రోజుల్లోనే హరికృష్ణ త్యజించాల్సి రావడం, ఆ తరువాత అవకాశం ఉన్నా ఏ పదవులు కట్టబెట్టకపోవడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. దాంతో వేరు కుంపటి పెట్టి రాష్ట్రమంతా తిరిగినా అనుకూల కథనాలు రాలేదు. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలకు ఎల్లో మీడియా పాత్ర ఎంతగానో ఉందనడంలో సందేహం లేదు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో వ్యతిరేక వార్తలు ఆంధ్రజ్యోతి, ఈనాడు వేశాయి. ఆ తరువాత సీఎంగా అధికారం చేపట్టిన జగన్ కు కూడా వీరి నుంచి తలనొప్పి ఎదురవుతూనే ఉంది. లోపాలు ఒకపక్క మాత్రమే ఉంటాయా? రెండు వైపు(చంద్రబాబు) ప్రభుత్వంలో లేవా అంటే సమాధానం ఉండదు. తమకు నచ్చని వారిని ఎడాపెడా వాయించడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకున్నాయనే విమర్శలు వస్తున్నా లెక్క చేయడం లేదు. అంతా ‘‘ఎల్లో’’ మాయ.