
Anasuya Bharadwaj: అనసూయ వీకెండ్ మూడ్ లో ఉన్నారు. షూటింగ్స్ లేకపోవడంతో జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన చిన్న వీడియో వైరల్ అవుతుంది. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో కన్నుకొడుతూ క్రేజీ ఫోజులిచ్చారు. ఈ వీడియోలో అనసూయ డీగ్లామర్ గా ఉన్నారు. కారణం ఆమె మేకప్ ధరించలేదు. దానికి తోడు మూతి తిప్పుతూ, కన్నుకొడుతూ ముఖాన్ని రకరకాలుగా పెట్టారు. చందమామలా ఉండే అనసూయ మేకప్ లేకుండా ఒకింత ఇబ్బంది పెట్టారు. దీంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మేకప్ లేకుంటే మీరిలా ఉంటారా? మీ అసలమైన అందం ఇదా అంటూ… ఎద్దేవా చేస్తున్నారు.
అనసూయ సహజ అందగత్తెనే. మేకప్ లో ఆమె సూపర్ గ్లామరస్ గా ఉంటారు. ఆ లుక్ తో పోల్చుకుంటున్న జనాలు ఆమె నాచురల్ ఫేస్ ని ఇష్టపడలేకపోతున్నారు. ఈ మధ్య అనసూయ తరచుగా మేకప్ వేసుకోకుండానే కెమెరా ముందుకు వస్తున్నారు. తన నేచురల్ ఫోటోలు, వీడియోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నారు. వాటి మీద ఎప్పటిలానే ట్రోలింగ్ జరుగుతుంది.
అయితే అనసూయను ట్రోల్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. హద్దులు మీరి కామెంట్స్ చేస్తే అనసూయ అసలు సహించరు. సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసి ఊచలు లెక్కపెట్టిస్తారు. ఇప్పటికే చాలా మంది అనసూయ కంప్లైన్ట్ తో కారాగారవాసం చేశారు. తాజాగా అనసూయ హెచ్చరిస్తూ ఓ ప్రింట్ మీడియా కటింగ్ కూడా షేర్ చేశారు. హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ కి చెందిన డీసీపీ స్నేహా మెహ్రా సోషల్ మీడియా వేధింపులకు పాల్పడితే చర్యలు తప్పవంటూ ప్రకటన చేశారు. దాన్ని తన ట్విట్టర్ లో అనసూయ షేర్ చేశారు.

ఇక అనసూయ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. యాంకరింగ్ వదిలేసినప్పటికీ నటిగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్నారు. ఇటీవల రంగమార్తాండ మూవీలో అనసూయ కీలక రోల్ చేశారు. ఆమె పాత్రకు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఆమె పుష్ప 2 మూవీలో నటిస్తున్నారు. అలాగే కొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. అనసూయ ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా తెరకెక్కడం విశేషం.