Anasuya Bharadwaj: ట్రోల్స్ అంటే అనసూయకు అసలు నచ్చదు. తనపై ఎవరు సెటైర్ వేసినా వెంటనే రియాక్ట్ అవుతుంది. సాధారణంగా వందల సంఖ్యలో వచ్చే సోషల్ మీడియా నెగిటివ్ కామెంట్స్ ని సెలెబ్రిటీలు పట్టించుకోరు. అనసూయ మాత్రం ప్రతిదానికి రియాక్ట్ అవుతారు.తాజాగా తనపై నెగిటివ్ కామెంట్స్ చేసే నెటిజెన్స్ ని ఉద్దేశిస్తూ ఓ సంచలన ట్వీట్ చేసింది అనసూయ. సదరు ట్వీట్ లో ”ఎందుకురా నేనంటే మీకు అంత పిచ్చి ప్రేమ. నేను ఏదన్నా మీకు అంత ఇంపార్టెంట్. ఏదన్నా అంత ఫీల్ అవుతారు.. అయ్యో పిచ్చి క్యూటీస్. ఇప్పుడు ఆ పిచ్చి క్యూటీస్ అందరూ మళ్ళీ ఫీల్ అయ్యి రియాక్ట్ అవుతారా?? సరే మీకు నాకోసం అంత టైం ఉందంటే మీ ఇష్టం…” అని కామెంట్ చేసింది.

నేను ఏది మాట్లాడినా, ఏం చేసినా మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు. అంత ఖాళీగా ఉన్నారా పిచ్చివాళ్ళలారా అని ముద్దుగా తిట్టింది. నా కోసం టైం కేటాయించే కంటే ఏదైనా పని చేసుకోవచ్చుగా అని ఆమె సెటైర్ వేశారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేసే వారి సంఖ్య అధికం కావడంతో వాళ్లందరికీ తనదైన శైలిలో చురకలు అంటించింది. లైగర్ వివాదం జరిగినప్పటి నుండి అనసూయపై నెగిటివిటీ పెరిగిపోయింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ఆంటీ అంటూ ట్రోల్ చేసిన విషయం తెలిసిందే.
అలాగే గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ విషయంలో మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. ఆమె ఆ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడంతో నువ్వు ఏమైనా నయనతార అనుకుంటున్నావా? అంటూ ట్రోల్ చేశారు. మెగా ఫ్యాన్స్ కావడంతో చేసేది లేక అనసూయ వివరణ ఇచ్చారు. బిజీ షెడ్యూల్స్ కారణంగా ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయానని అనసూయ సమాధానం ఇచ్చుకుంది. ఇక అనసూయ సోషల్ మీడియా పోస్ట్స్, కామెంట్స్ ని కూడా నెటిజెన్స్ ట్రోల్ చేస్తుండగా ఆమె… ట్విట్టర్ లో ఈ విధమైన పోస్ట్ పెట్టింది.

పిచ్చి క్యూటీస్ అంటూ రెచ్చిపోయింది. అనసూయ కెరీర్ పీక్స్ లో ఉండగా అనవసర వివాదాల్లో తలదూర్చుతున్నారన్న వాదన ఉంది. లైగర్ వివాదం అలాంటిదే. ఎప్పుడో 2017 లో జరిగిన అర్జున్ రెడ్డి వివాదాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి ఆమె గొడవ మొదలుపెట్టింది. ఈ విషయంలో ఇండస్ట్రీ నుండి కూడా ఆమె వ్యతిరేకత ఎదురైంది. బ్రహ్మాజీ లాంటి నటులు పరోక్షంగా విమర్శించారు. ఆంటీ అంటూ అనసూయను ట్రోల్ చేస్తుంటే ఆమెకు ఒక్కరు కూడా మద్దతుగా నిలబడలేదు.
😂😂 Yendukura nenante meeku anta pichi prema.. nenedanna meeku anta important.. edanna anta feel autaru.. ayyooo pichi cuties.. ippudu “aa picchi cuties” andaru malli feel ayyi react autara?? Sare meeku nakosam anta time undante mee ishtam 😅
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 7, 2022