
Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ తరచుగా ట్రోలింగ్ కి గురవుతుంది. ఆమె ఎలాంటి పోస్ట్ పెట్టినా క్రింద నెగిటివ్ కామెంట్స్ తో వ్యతిరేకులు రచ్చ చేస్తుంటారు. సోషల్ మీడియాలో అనసూయ అంతటి క్రిటిసిజం మరొకరు ఫేస్ చేయడం లేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా అనసూయను ఆంటీ అంటూ ట్రోల్ చేస్తుంటారు. ఇలాంటి బట్టలు నీకు అవసరమా ఆంటీ?, నువ్వు ఎంత ట్రై చేసిన నువ్వు అమ్మాయివి కావు ఆంటీవే?… వంటి నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ఈ ఆంటీ అనే పదం అనసూయకు అసలు నచ్చదు. అందుకే నెటిజెన్స్ ఆమెను అలా పిలిచి ఉడికిస్తుంటారు.
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆంటీ పదం భారీగా ట్రెండ్ చేశారు. లైగర్ మూవీ ఫెయిల్యూర్ ని ఎంజాయ్ చేస్తూ అనసూయ సెటైరికల్ ట్వీట్ వేశారు. అది తమ హీరో మూవీ గురించే అని అర్థం చేసుకున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమె మీద కత్తి కట్టారు. ఆంటీ అని ట్రోల్ చేశారు. అనసూయ కూడా తగ్గలేదు. సోషల్ మీడియాలో వాళ్లతో వాగ్వాదానికి దిగింది. పోటాపోటీగా ట్వీట్స్ వేసింది.
ఈ ఆంటీ అనే పదం ఎంతగా వైరల్ అయ్యిందంటే… నటుడు బ్రహ్మాజీ సైతం అనసూయ మీద సోషల్ మీడియాలో సెటైర్స్ వేశారు. తాజాగా అనసూయ తనకు ఆంటీ అంటే ఎందుకు కోపం వస్తుందో వెల్లడించారు. అనసూయ ఆన్లైన్ చాట్ పాల్గొన్నారు. ఆమెను ఓ నెటిజన్ ‘అక్కా మీకు ఆంటీ అంటే అంత కోపం ఎందుకు? అని అడిగాడు. నెటిజన్ ప్రశ్నకు అనసూయ ఆసక్తికర సమాధానం చెప్పారు.

ఆంటీ అంటే నాకు కోపం వస్తుంది. కారణం ఆంటీ అని పిలవడం వెనుక వాళ్ళ అర్థం వేరే ఉంటుంది. అందుకే నాకు నచ్చదు. కానీ ఈ మధ్య నాకు కోపం రావడం లేదు. వాళ్ళ కర్మ అని వదిలేశాను. ఈ పనికిమాలిన వాళ్ళను మార్చడం కంటే ముఖ్యమైన పనులు ఎన్నో ఉన్నాయి…. అంటూ సమాధానం ఇచ్చారు. అనసూయ ఆన్సర్ వైరల్ గా మారింది. కాగా అనసూయ మితిమీరిన ట్రోలింగ్ ని సహించదు. అనసూయ కంప్లైంట్స్ కారణంగా జైలుపాలైన కుర్రాళ్ళు చాలా మందే ఉన్నారు. ఆమె పట్ల ఆకతాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండటమే మంచిది.
