Anasuya Bharadwaj On Liger : వర్ధమాన విషయాలపై సంచలన కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది యాంకర్ అనసూయ. ఈ హాట్ బ్యూటీ అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై బిజీ ఆర్టిస్ట్ గా మారింది. ఎప్పుడూ ఏదో విషయంపై స్పందిస్తూ కాకరేపుతూనే ఉంటుంది. తాజాగా మరో పెను దుమారం రేపేలా ఒక ట్వీట్ చేసింది. అదిప్పుడు వైరల్ గా మారింది. అనసూయ చేసిన ట్వీట్ ఎవరి గురించి అని అందరూ ఆరాతీస్తున్నారు. అది ‘లైగర్’ మూవీ ఫ్లాప్ అయ్యిందనే అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ లైగర్ టీంకు అనసూయకు ఎక్కడ చెడింది? వారి ఫ్లాప్ పై అనసూయ ఇలా ఎందుకు ఆడిపోసుకుందన్నది హాట్ టాపిక్ గా మారింది.

అనసూయ తాజాగా ట్విట్టర్ లో ఒక ఘాటు ట్వీట్ చేసింది. ‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్ని సార్లు రావటం లేటవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా..!’ అంటూ #NotHappyOnsomeonesSadness but #FaithRestored అంటూ ఇంగ్లీష్ లో కొటేషన్ పెట్టింది. లైగర్ సినిమా ఫలితం వచ్చి నెగెటివ్ టాక్ వచ్చాక మధ్యాహ్నం 2.45 గంటలకు ఈ ట్వీట్ చేయడం విశేషం. దీంతో ఇది ఖచ్చితంగా లైగర్ ఫ్లాప్ గురించేనని అందరూ కామెంట్ చేస్తున్నారు.
ఎవరో బాధపడుతున్నారని నేను ఆనంద పడడం లేదని.. కానీ కర్మ రావడం పక్కా అనే విషయం మీద తనకు నమ్మకం ఏర్పడింది అంటూ అనసూయ పరోక్షంగా ట్వీట్ చేసింది. అయితే ఇది విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా గురించేనని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా సమయంలో విజయ్ దేవరకొండ-అనసూయ మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగింది. అర్జున్ రెడ్డి సినిమాలో తల్లిపై విజయ్ చేసిన ఓ కామెంట్ ను గుర్తు చేస్తూ అనసూయ నాడు ప్రశ్నించింది. సినిమాలో ముద్దు సీన్లు.. అసభ్యతను టార్గెట్ చేసి నాడు తీవ్రంగా విమర్శించింది. విజయ్ దేవరకొండ నాడు అనసూయపై పరోక్షంగా కౌంటర్లు వేశాడు. అప్పట్లో ఈ వివాదం పెద్ద రచ్చ అయ్యింది.
ఇప్పుడు ‘లైగర్’ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చిన వెంటనే అనసూయ ‘కర్మ’ అంటూ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. అనసూయ లైగర్ ప్లాప్ ను ఎంజాయ్ చేస్తోందని ఆమెపై ట్రోలింగ్ జరుగుతోంది. ఇలాంటి టైంలో పుండుమీద కారం చల్లినట్లు కామెంట్స్ అవసరమా? అని కొందరు నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. మరికొందరు బూతులతో అనసూయను తిట్టిపోస్తున్నారు.
అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!#NotHappyOnsomeonesSadness but #FaithRestored
— Anasuya Bharadwaj (@anusuyakhasba) August 25, 2022