
Anasuya Bharadwaj: అనసూయ మరీ సోషల్ మీడియా ఫ్రీక్ అయ్యారు. ప్రతి విషయం ఫ్యాన్స్ తో షేర్ చేస్తున్నారు. తాజాగా ఆమె మేకప్ లెస్ లుక్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆమె లాంగ్ వీకెండ్ లో ఉన్నారట. జిమ్ వేర్ లో సోఫాలో కూర్చుని కాఫీ తాగుతున్న ఫోటోలు పోస్ట్ చేశారు. సదరు ఫోటోలకు ‘లాంగ్ వీకెండ్ లవ్’ అంటూ కామెంట్ పెట్టారు. ఇక అనసూయ ఫోటోలు చూసిన వెంటనే సోషల్ మీడియా జనాలు కామెంట్స్ స్టార్ట్ చేశారు. ఓ నెటిజన్ ‘చీర కాస్త చడ్డీ అయ్యిందా, దారుణం’ అంటూ కామెంట్ పెట్టాడు. ఇటీవల అనసూయ పట్టుచీరలో ఫోటో షూట్ చేశారు. ఇప్పుడేమో ఇంట్లో సాధారణంగా ధరించే బట్టల్లో కనిపించారు. ఆ ఉద్దేశంతో పట్టు చీర కట్టిన అనసూయ చడ్డీకి మారిపోయిందని ఎద్దేవా చేశాడు.

నిజానికి ఇలాంటి ఫోటోలు సెలెబ్రిటీలు పబ్లిక్ ఫ్లాట్ ఫార్మ్ లో పెట్టరు. హీరోయిన్స్ తమ డీగ్లామర్ లుక్ రివీల్ చేసేందుకు ఇష్టపడరు. అనసూయ అందరు లాంటి అమ్మాయి కాదు కదా. ఆమె చర్యలు కొంచెం బోల్డ్ గానే ఉంటాయి. అదే సమయంలో తన ఫోటోలపై ఎవరైనా వల్గర్ కామెంట్ చేస్తే… అసలు ఊరుకోరు వెంటనే కౌంటర్ ఇస్తారు.

ఆ మధ్య అనసూయ భర్తను ఉద్దేశించి ఒక నెటిజెన్ అనుచిత కామెంట్స్ చేశాడు. వాడు వీడు అంటూ అమర్యాదకర కామెంట్ పెట్టాడు. అనసూయ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. వెనకా ముందు చూడకుండా ఇచ్చి పడేసింది. చెప్పుతో కొడతా అంటూ కౌంటర్స్ ఇచ్చింది. ఇక అనసూయ సినిమాల్లో బిజీగా ఉన్నారు. త్వరలో ఆమె నటించిన రంగమార్తాండ విడుదల కానుంది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు చేయగా… అనసూయ కీలక రోల్ చేశారు.
అలాగే పుష్ప 2 షూట్ లో ఆమె పాల్గొంటున్నారు. ఇటీవల పుష్ప ది రూల్ చిత్రీకరణ మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతుంది. ప్రధాన విలన్ రోల్ చేస్తున్న ఫహద్ ఫాజిల్ షూటింగ్ పాల్గొంటున్నట్లు సమాచారం. పుష్ప 2 మూవీలో దాక్షాయణిగా డీగ్లామర్ రోల్ లో అనసూయ మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.

కాగా అనసూయ యాంకరింగ్ వదిలేశారు. ఇక బుల్లితెరపై కనిపించేది లేదని ఇటీవల స్పష్టత ఇచ్చారు. టిఆర్పీ కోసం షో మేకర్స్ చెత్త స్టంట్స్ ప్లే చేస్తున్నారు. అవి నాకు నచ్చడం లేదు. అందుకే యాంకరింగ్ కి దూరమయ్యానని అనసూయ పరోక్షంగా ఘాటు కామెంట్స్ చేశారు. ఆమె నటిగా దూసుకెళ్తున్నారు . కెరీర్ సక్సెస్ ట్రాక్ లో వెళుతుండగా యాంకరింగ్ చేయాల్సిన అవసరం తనకు లేదని చెప్పకనే చెబుతున్నారు.