Anand Mahindra Tweet: ఆనంద్ మహీంద్రా… పరిచయ వ్యాక్యం అక్కరలేని వ్యాపారవేత్త. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటారు. ట్విట్టర్లో కొత్త కొత్త వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. నచ్చిన వీడియోను రీ_ట్వీట్ చేసి హర్షం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఏదైనా ఆవిష్కరణ నచ్చితే వెంటనే అభినందిస్తూ ఉంటారు.. మనకు తోచినంత సహాయం చేస్తూ ఉంటారు. కొవిడ్ సమయంలో ఓ వృద్ధ మహిళ ఉచితంగా ఇడ్లీలు తయారుచేసి, వలస కార్మికులకు అందజేస్తున్న తీరుపై ఎవరో వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దాన్ని చూసి మెచ్చుకున్న ఆనంద్ మహీంద్రా వెంటనే ఆ వృద్ధ మహిళకు అధునాతన ఇడ్లి యంత్రాలు కొనిచ్చారు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆనంద్ మహీంద్రా ఉపోద్ఘాతం ఇప్పటితో ముగియదు.
వైరల్
అయితే ఆనంద్ మహీంద్రా కేవలం సామాజిక విషయాలు మాత్రమే కాదు.. తన కంపెనీకి సంబంధించిన ఉత్పత్తులను కూడా విభిన్నంగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటాడు. ప్రమోట్ చేసుకోవడం మాత్రమే కాదు పలువురిని ట్యాగ్ చేసి అభిప్రాయం ఎలా ఉందో చెప్పమంటాడు.. అయితే అలాంటి ఆనంద్ మహేంద్రా ఇప్పుడు పోస్ట్ చేసిన ఒక వీడియో ట్విట్టర్ ను షేక్ చేస్తోంది. ” ఇది కదా ఆనందం అంటే” అని ఆయన జోడించిన క్యాప్షన్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. మహీంద్రా కంపెనీ చాలా సంవత్సరాల నుంచి ప్రజలకు అవసరమయ్యే ఉత్పత్తులు తయారు చేస్తూ వారి మన్నన పొందుతూ ఉంది. మహీంద్రా తయారు చేసే కార్లు కూడా చాలామంది ప్రజల అభిమానాన్ని చురగొన్నాయి. శ్రీమంతులకు మహీంద్రా తయారు చేసే వాహనాలు కొనుగోలు చేయడం పెద్ద లెక్కలోది కాదు. కానీ మధ్యతరగతి వాళ్లు అలాంటి కలను నెరవేర్చుకోవడానికి చాలా ప్రయాస పడతారు. పొదుపు పథకాల్లో డబ్బులు ఆదా చేస్తారు. లేకుంటే బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటారు. ప్రతినెల వాయిదా రూపంలో వాటిని చెల్లిస్తూ ఉంటారు.
చత్తీస్గడ్ రాష్ట్రంలో..
చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబం మహీంద్ర గ్రూపు తయారుచేసిన “స్కార్పియో ఎన్ ఎస్ యు వి” ని కొనుగోలు చేసింది. షోరూం వారు డెలివరీ చేస్తున్నప్పుడు కారు కొన్న సదరు కుటుంబ సభ్యుల సంతోషం రెట్టింపు అయింది. షోరూం లో కారు ముందు వారు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. కుటుంబం మొత్తం చేసిన డ్యాన్సును కొంతమంది వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఆనంద్ కంట పడటం, పైగా అది తన కంపెనీ ఉత్పత్తి కావడంతో రెండో మాటకు తావు లేకుండా వెంటనే ట్విట్టర్లో షేర్ చేశాడు..” ఇది కదా ఆనందం అంటే” అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు భారతదేశ ఆటోమొబైల్ రంగంలో పనిచేస్తున్నందుకు నాకు లభించే నిజమైన రివార్డు ఇదే అంటూ వ్యాఖ్యానించాడు.. ఆనంద్ ఈ వీడియో షేర్ చేసిన తర్వాత ఆయనను అనుసరించేవారు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇన్ని రోజులు ఎదురు చూసిన తర్వాత కారు తమ సొంతమైతే అంతే సార్ అంటూ వ్యాఖ్యనిస్తున్నారు. ఆ కారు కట్నం కింద వచ్చిందేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
What a Joyful Moment! People dancing while taking thé delivery of their Mahindra Scorpio-N SUV.@anandmahindra @Mahindra_Auto @BosePratap @MahindraScorpio @RajeshJejurikar pic.twitter.com/bzrNeA3FQ3
— Car News Guru (@CarNewsGuru1) May 17, 2023