
Manchu Brothers Fight: ఈ మధ్య కాలంలో చిన్న హీరోలు తమ చిత్రాలకు ప్రచారం కల్పించుకోవడం కోసం ఫ్రాంక్ టెక్నిక్ వాడుతున్నారు. విశ్వక్ సేన్, బిగ్ బాస్ సన్నీ, నందుతో పాటు పలువురు నటులు తమ చిత్రాల విడుదలకు ముందు సెన్సేషన్ చేయడం, వార్తల్లో నిలవడం చేశారు. ఆ విధంగా చేస్తే మీడియా తమ గురించి ప్రముఖంగా కవర్ చేస్తుంది. ఫ్రీ పబ్లిసిటీ దక్కుతుంది. అదే సమయంలో ఈజీగా జనాల్లోకి మేటర్ వెళుతుంది. చెప్పాలంటే ఇది ఛీప్ అండ్ సిల్లీ స్టంట్. ఈ ఫ్రాంక్ లు వివాదాస్పదం కూడా అయ్యాయి. నడి రోడ్డు మీద విశ్వక్ స్నేక్ న్యూసెన్స్ చేశాడని పబ్లిక్ అతని మీద ఫైర్ అయ్యారు.
ఇలాంటి చీఫ్ ఫ్రాంక్ మోహన్ బాబు కుమారులు చేయడం దారుణ పరిణామం. మోహన్ బాబు 500లకు పైగా చిత్రాల్లో నటించిన సీనియర్ యాక్టర్. టాలీవుడ్ బడా ఫ్యామిలీస్ లో మంచువారిది కూడా ఒకటి. మోహన్ బాబు అనేక పదవులు అలంకరించారు. కొడుకు విష్ణు ప్రస్తుతం ‘మా’ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇంత ఘన చరిత్ర ఉన్న మంచు వారసులు కేవలం ఓ రియాలిటీ షో కోసం కుటుంబ పరువుతో గేమ్స్ ఆడటంపై పబ్లిక్ దుమ్మెత్తిపోస్తున్నారు. డబ్బుల కోసం కుటుంబ ఇజ్జత్ తీసేస్తారా అని మండి పడుతున్నారు.
ఫ్రాంక్ చేసినా మరో మార్గం ఎంచుకుంటే బాగుండేది. అన్నదమ్ములు గొడవలు పడుతున్నట్లు వీడియో విడుదల చేయడం అవసరమా అంటున్నారు. అన్నయ్య విష్ణు మీద మనోజ్ విడుదల చేసిన వీడియో ఫ్రాంక్ అని తెలిసి టాలీవుడ్ వర్గాలు విస్మయానికి గురయ్యారు. ఇప్పటికే మంచు కుటుంబం ఇమేజ్ చాలా వీక్ గా ఉంది. మోహన్ బాబుతో పాటు మనోజ్, విష్ణు పరిశ్రమలో రాణించలేకపోతున్నారు. మోహన్ బాబు కొడుకుల మీద పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ఇద్దరిలో కనీసం ఒక్కరైనా ఓ స్థాయి హీరో అవుతాడని ఆయన అనుకున్నారు. విష్ణు, మనోజ్ టైర్ టు హీరోల లిస్ట్ లో కూడా లేరు.

చెప్పాలంటే మంచు ఫ్యామిలీ టాలీవుడ్ లో మీమ్స్, ట్రోల్స్ మెటీరియల్ గా మిగిలిపోయింది. ట్రోలర్స్ కి ఈ సంఘటనతో మరింతగా దొరికిపోయారు. తామే స్వయంగా అవకాశం ఇచ్చారు. నిన్న విష్ణు సోషల్ మీడియాలో ‘హౌస్ ఆఫ్ మంచూస్’ పేరుతో రియాలిటీ షో స్టార్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రియాలిటీ షో ప్రమోషన్స్ లో భాగంగానే మనోజ్ తాను గొడవపడుతున్న వీడియో విడుదల చేశాడని క్లారిటీ ఇచ్చాడు. ఏది ఏమైనా మనోజ్-విష్ణు ఇచ్చిన షాక్ కి అందరి మైండ్స్ బ్లాక్ అయ్యాయి. అదే సమయంలో వారు అబాసుపాలవుతున్నారు.