
Childhood Pic: బర్త్ డే సందర్భంగా ఓ పాప తన తల్లికి ముద్దులు పెడుతోంది. ముద్దులొలికే ఈ చిన్నారిని చూస్తే ఎవరికైనా మనసు ఉల్లాసంగా మారుతుంది. అయితే ఇమె ఇప్పుడు సినిమా హీరోయిన్. అంతేకాకుండా ఓ హిట్టు సినిమాలో నటించింది. చాలా మంది నేటి నటులు తమ జన్మదినం సందర్భంగా చైల్డ్ హుడ్ ఫోటోస్ ను బయటకు తీస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పెట్టి హల్ చల్ చేస్తున్నారు. అలాగే ఓ హీరోయిన్ తన చిన్నప్పటి ఫొటోను నెట్టింట్లో పెట్టడంతో ఆ పిక్ వైరల్ గా మారింది. అయితే చిన్నగా ఉన్నప్పుడే క్యూట్ గా ఉన్న ఆ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసుకోవాలని ఉందా?
అందం ఆమెకు పుట్టుకతోనే వచ్చినట్లుంది. అందుకే అందాల పోటీల ఫ్రైజ్ లన్నీ ఆమెకు సొంతమయ్యాయి. పెద్దయ్యాక మోడల్ గా కెరీర్ స్ట్రాట్ చేసిన తరువాత మిస్ ఆంధ్ర, మిస్ తెలంగాణ టైటలన్నీ ఈమె గెలుచుకుంది. సన్నజాజి తీగ లాంటి నడుము కలిగిన ఈ భామను ఇప్పుడు చూస్తే షాక్ అవ్వకుండా ఉండరు. నవ్వితే నవరత్నాలు మెరిసినంత అందంగా ఉండే ఈ బ్యూటీ ఎవరో ఇప్పుడైనా గుర్తుపట్టారా? అయితే మేం చెప్పేస్తున్నాం.
పై ఫొటలో క్యూట్ గా ఉన్నఅమ్మాయి నేటి హీరోయిన్ సిమ్రాన్ చౌదరి. ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ ఆమె నటించిన సినిమాలు చెబితే గుర్తుపడుతారు. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది?’ అనే మూవీ హిట్టు కొట్టిన విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా నటించిన సిమ్రాన్ చౌదరి మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్ లోనే జన్మించిన ఈమె ఓ వైపు చదువుతూనే..మరోవైపు మోడలింగ్ రంగంలో అడుగుపెట్టారు. ఆ తరువాత అందాల పోటీల్లో పాల్గొని అనేక టైటిట్స్ ను గెలుచుకున్నారు.

2012లో మిస్ ఆంధ్రా, టాలీవుడ్ మిస్ హైదరాబాద్, 2017లో ‘ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ’ పోటీల్లో విజేతగా నిలిచింది. అయితే ఈ భామ అంతకుముందే అంటే 2014లో ‘హమ్ తుమ్’ అనే సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ‘ఈ నగరానికి ఏమైంది?’ అనే మూవీతో గుర్తింపు వచ్చింది. ఆ తరువాత సిమ్రాన్ చౌదరి బొంబాట్, పాగల్, చెక్, సెహరి, తదితర సినిమాల్లో నటించింది.
అయితే ఈ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో సిమ్రాన్ ను ఎవరూ పట్టించుకోవడ లేదని అనుకుంటున్నారు. కానీ వన్నెతరగని అందం ఆమె సొంతం. ఆమె అందాలన్నీ ఆరబోసే పిక్స్ అన్నింటినీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ గా మారుతున్నాయి. మరి ఇప్పుడైనా ఈ బ్యూటికి అవకాశాలు దక్కుతాయో? లేదో? చూడాలి.