Pooja Hegde Marriage: బుట్ట బొమ్మ పూజా హెగ్డే పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది. ఈ మేరకు కథనాలు వెలువడుతున్నాయి. ఇది పూజా హెగ్డే నిర్ణయమే అని తెలుస్తుండగా త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు. పాతికేళ్ల లోపు వివాహం చేసుకోవడం ఉత్తమం. అది పెళ్లి బంధంలోకి అడుగు పెట్టడానికి సరైన సమయం. ఆ తర్వాత గడిచే ప్రతి ఏడాది వృద్ధాప్యం వైపు తీసుకెళ్తున్నట్లే లెక్క. పూజా హెగ్డే ప్రస్తుత వయసు 32 సంవత్సరాలు. అంటే ఆమెకు ఏజ్ బార్ అయినట్లే.

గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారు పెళ్లికి ససేమిరా అంటారు. టబు, శోభన వంటి హీరోయిన్స్ అసలు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయారు. అలాంటి తప్పు నేను చేయనంటుంది పూజా హెగ్డే. కెరీర్ సంగతి ఎలా ఉన్నా ఈ ఏడాది ఆమె పెళ్లి పీటలు ఎక్కాలని డిసైడ్ అయ్యారట. అబ్బాయి కూడా ఫిక్స్ అట. పూజాకు చిన్నప్పటి నుండి పరిచయం ఉన్న తన మిత్రుడినే వివాహం చేసుకుంటున్నారట. ఆయన ఇప్పుడు వ్యాపారవేత్తగా ఉన్నారట. ఇరు కుటుంబాల సభ్యులు ఈ మేరకు మాట్లాడుకొని నిర్ణయం తీసుకున్నారట.
పూజా హెగ్డే పెళ్లిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ ఈ వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. కాగా గత ఏడాది పూజా హెగ్డే గడ్డు పరిస్థితి ఎదుర్కొంది. ఆమెకసలు కలిసి రాలేదు. ఏకంగా నాలుగు ప్లాప్స్ ఆమె ఖాతాలో పడ్డాయి. రాధే శ్యామ్, ఆచార్య టాలీవుడ్ అతి పెద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. విజయ్ కి జంటగా నటించిన బీస్ట్ సైతం నిరాశపరిచింది. ఇక రణ్వీర్ సింగ్ తో జతకట్టిన హిందీ మూవీ సర్కస్ బాలీవుడ్ ఎపిక్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ దశాబ్దపు చెత్త సినిమాగా దాన్ని ప్రేక్షకులు అభివర్ణిస్తున్నారు.

దానికి తోడు సెట్స్ పై ఉన్న జనగణమన మూవీ మధ్యలో ఆగిపోయింది. ఆ కారణంగా రూ. 4 కోట్ల రెమ్యూనరేషన్ కోల్పోయింది. మొత్తంగా 2022 పూజా హెగ్డేకి చేదు అనుభవాన్ని మిగిల్చింది. అయినప్పటికీ పూజా హెగ్డే ఖాతాలో రెండు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. సల్మాన్ కి జంటగా కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రం చేస్తున్నారు. ఆ మధ్య పూజ-సల్మాన్ మధ్య ఎఫైర్ రూమర్స్ రావడం విశేషం. ఇక మహేష్ కి జంటగా ఎస్ఎస్ఎంబి 28 చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలతో హిట్ ట్రాక్ ఎక్కుతానని పూజా హెగ్డే భావిస్తున్నారు.