Adilabad: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు బుధవారం(ఫిబ్రవరి 27న) ప్రారంభమయ్యాయి. ఎప్పటిలాగానే ఇంటర్ బోర్డు ఈ ఏడాది కూడా పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు బిగించింది. నిమిషం నిబంధన ఈ ఏడాది కూడా ఉంటుందని ప్రకటించింది. పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలని సూచించింది. అయితే ఈ నిబంధన ఓ విద్యార్థి ప్రాణం తీసింది.
ఏం జరిగిందంటే..
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మాంగూర్ల గ్రామానికి చెందిన టేకం శివకుమార్ ఇంటర్ చదివాడు. గురువారం(ఫిబ్రవరి 29) సాత్నాలా బ్యారేజీలో దూకి ఆత్మహథ్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ లేఖ రాశాడు.
పరీక్ష రాయలేకపోయానని..
శివకుమార్ ఆదిలాబాద్ బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ జూరియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. పరీక్షల కేంద్రం కలెక్టరేట్ సమీపంలోని టీఎస్‌ఎస్‌డబ్ల్యూఆర్‌జేఆర్ కళాశాలలో సెంటర్ పడింది. మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు బుధవారం సెంటర్‌కు వెళ్లాడు. అప్పటికే సమయం ముగియడంతో ప్రిన్సిపాల్ విద్యార్థిని లోనికి అనుమతించలేదు. దీంతో శివకుమార్ పరీక్ష రాయలేకపోయాడు. 9 నిమిషాలు కేంద్రానికి ఆలస్యంగా వచ్చాడని అధికారులు తెలిపారు.
మనస్థాపంతో..
పరీక్ష రాయలేకపోయానన్న మనస్థాపంతో శివకుమార్ గురువారం(ఫిబ్రవరి 27)న సాత్నాలా డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు సూసైడ్ లేఖ రాశాడు. పరీక్ష రాయనందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నాడు. పోలీసులు విద్యార్థి మృతదేహాన్ని డ్యాం నుంచి బయటకు తీయించారు. ఈమేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: An inter student ended his life for not appearing in the exam in adilabad district
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com