Phone Blast: జేబులో పేలిన సెల్ ఫోన్

పేలుడు వల్ల నడుము కింది భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడ్ని హుటాహుటిన ఓ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైట్ ఫీల్డ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Written By: Dharma, Updated On : January 4, 2024 2:01 pm

Phone Blast

Follow us on

Phone Blast: ఓ యువకుడు బైక్ పై వెళుతుండగా.. ఆయన జేబులో ఉన్న సెల్ ఫోన్ పేలిపోయింది. ఆ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో బుధవారం జరిగింది. బాధ్యత యువకుడు ప్రసాద్ గా గుర్తించారు. ఆయన ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. బుధవారం బైక్ పై వెళ్తూ తన మొబైల్ ని ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. ఆ సమయంలో మొబైల్ ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు వల్ల నడుము కింది భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడ్ని హుటాహుటిన ఓ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైట్ ఫీల్డ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటన నేపథ్యంలో సెల్ఫోన్ కొన్న షోరూమ్ ను బాధితుడి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు ఆశ్రయించారు. ప్రసాద్ వైద్యానికయ్యే ఖర్చులను భరిస్తామని.. మొబైల్ డబ్బులను సైతం తిరిగి ఇప్పిస్తామని షోరూం వారు హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రసాద్ కు శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని.. అందుకు నాలుగు లక్షల రూపాయలు అవసరమని వైద్యులు తెలిపారు. అందుకే ఈ చికిత్స మొత్తానికి అయ్యే ఖర్చును షోరూం వారే భరించాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే పూర్తిగా తాము డబ్బులు చెల్లించవలెనని.. కొంతవరకే భరించగలమని షోరూం ప్రతినిధులు చెబుతున్నారు. దీంతో ఇదో వివాదంగా మారింది.

ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్లు పేలిపోతున్నాయి. ఎలక్ట్రిక్ మోటార్ వాహనాలు సైతం కాలిపోతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్లో కర్ణాటకలోని సొరభ తాలూకాలో కూడా ఇటువంటి ఘటనే జరిగింది. బైక్ పై వెళుతున్న యువకుడి ప్యాంటు జేబులో మొబైల్ ఫోన్ పేలింది. పేలుడు కారణంగా బైక్ అదుపుతప్పి సమీపంలోని చెరువులోకి దూసుకెళ్లింది. కేరళలో కూడా ఇటువంటి ఘటనే ఒకటి జరిగింది. త్రిసూర్ జిల్లాలో 76 ఏళ్ల వృద్ధిని జేబులో ఫోన్ పేలింది.