Salaar Vs Dalapathi: సలార్ కి, దళపతి కి మధ్య సంబంధం ఏంటి..? ఈ రెండు కథలు ఇక్కడి నుంచి తీసుకున్నారంటే..?

సలార్ లో కూడా ప్రభాస్ తన ఫ్రెండ్ కోసం అందరిని ఎదిరిస్తూ వస్తున్నప్పటికీ తనకు తెలియకుండానే తనలో ఒక రాజు ఉన్నాడు అనేది సినిమా చివర లో ఎస్టాబ్లిష్ చేశారు అంటే సెకండ్ పార్ట్ లో శౌర్యంగ పర్వం లో ప్రభాస్ రాజు కాబోతున్నట్టుగా తెలియజేశాడు.

Written By: Gopi, Updated On : January 4, 2024 1:56 pm

Salaar Vs Dalapathi

Follow us on

Salaar Vs Dalapathi: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా ఈమధ్య రిలీజ్ అయి భారీ వసూళ్లను రాబడుతుంది. ఇక ఈ సినిమా ఇప్పటికే 800 కోట్ల వరకు వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన సక్సెస్ ను సాధించడంతో ప్రభాస్ చాలా వరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు రజనీకాంత్ మమ్ముట్టిలు హీరోలుగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దళపతి సినిమా కి సలార్ సినిమా కి మధ్య పోటీ పెట్టీ చూస్తున్నారు.

అయితే ఈ రెండు సినిమాలకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే దానిమీద ఇప్పుడు చాలా రకాలైన చర్చలు అయితే జరుగుతున్నాయి. నిజానికి దళపతి సినిమా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగే కథ మహాభారతం లోని కర్ణుడు, దుర్యోధనుడు ని బేస్ చేసుకొని మణిరత్నం ఆ సినిమాని తెరకెక్కించాడు. అయితే సలార్ సినిమా కూడా ఇద్దరు ఫ్రెండ్స్ కు సంబంధించిన స్టోరీ అయినప్పటికీ ఈ స్టోరీ సెటప్ అనేది వేరేగా ఉంటుంది. అందువల్ల ఈ సినిమా ప్రేక్షకులకు దళపతి మూవీ ఇచ్చిన ఫ్లేవర్ కా ఫ్రెష్ ఫీల్ ని ఇస్తుంది అయితే దళపతిలో హీరో ఫ్రెండ్ కోసం అన్ని పనులు చేస్తూ ఉంటాడు.

అయితే సలార్ లో కూడా ప్రభాస్ తన ఫ్రెండ్ కోసం అందరిని ఎదిరిస్తూ వస్తున్నప్పటికీ తనకు తెలియకుండానే తనలో ఒక రాజు ఉన్నాడు అనేది సినిమా చివర లో ఎస్టాబ్లిష్ చేశారు అంటే సెకండ్ పార్ట్ లో శౌర్యంగ పర్వం లో ప్రభాస్ రాజు కాబోతున్నట్టుగా తెలియజేశాడు.ఇక ఇప్పుడు ప్రభాస్ కి పృథ్వి రాజ్ సుకుమారన్ కి మధ్య గొడవ అనేది స్టార్ట్ అయింది అంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గొడవ జరిగితే ఎలా ఉంటుందనేది చూపించడానికి సెకండ్ పార్ట్ ని తెరకెక్కిస్తున్నారు.

అయితే దళపతి సినిమాలో ఉన్న క్యారెక్టర్ కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి దళపతి లో రజనీకాంత్ చాలా ఎంజాయ్ ఫుల్ గా బతికే లైఫ్ లో ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం ప్రభాస్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీ తో ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా కామ్ గా ఉంటాడు…అయితే ఈ రెండు సినిమాల మధ్య చాలా డిఫరెన్స్ లు ఉన్నాయి అయినప్పటికీ ఇవి రెండు కూడా మహాభారతం నుంచి తీసుకున్న స్టోరీలు కావడం విశేషం….