https://oktelugu.com/

Ippatam Issue: ఇప్పటంలో కూల్చి వైసీపీ సర్కార్ ఏం సాధించింది?

Ippatam Issue: విపక్షాలకు ఆదరిస్తున్నారని తెలిసి వారిని తమ వైపు తిప్పుకోవడం అనేది రాజకీయం. వారికి సంక్షేమ పథకాలు అమలు చేయడమో.. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడమో చేసి వారి అభిమానాన్ని చూరగొనేవారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సీన్ మారింది. తమ వెంట నడుస్తావా? లేకుంటే ఇబ్బందులు పెట్టాలా? అన్నదే ఇప్పుడు కాన్సెప్ట్. కేవలం అధికార ప్రయోగమే ఫస్ట్ అండ్ లాస్ట్ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మా దారికి వస్తారా? లేకుంటే నీకు ‘దారి’ […]

Written By:
  • Dharma
  • , Updated On : March 6, 2023 10:56 am
    Follow us on

    Ippatam Issue

    Ippatam Issue: విపక్షాలకు ఆదరిస్తున్నారని తెలిసి వారిని తమ వైపు తిప్పుకోవడం అనేది రాజకీయం. వారికి సంక్షేమ పథకాలు అమలు చేయడమో.. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడమో చేసి వారి అభిమానాన్ని చూరగొనేవారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సీన్ మారింది. తమ వెంట నడుస్తావా? లేకుంటే ఇబ్బందులు పెట్టాలా? అన్నదే ఇప్పుడు కాన్సెప్ట్. కేవలం అధికార ప్రయోగమే ఫస్ట్ అండ్ లాస్ట్ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మా దారికి వస్తారా? లేకుంటే నీకు ‘దారి’ లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఏకంగా మందీ మార్భలంతో దిగి విధ్వంసం సృష్టిస్తున్నారు. గుంటూరు జిల్లా ఇప్పటంలో జరుగుతున్నది అదే. గతసారి రోడ్డు విస్తరణ పేరిట నిర్మాణాలను తొలగించిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు మలివిడతగా మరికొన్న ఇళ్ల నిర్మాణాలను తొలగించింది.

    Also Read: Kotam Reddy- Anam Ramanaraya Reddy: కోటంరెడ్డి, ఆనంల విషయంలో మారిన టీడీపీ స్ట్రాటజీ

    గత ఏడాది జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం గ్రామస్థులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. పంట భూములను సైతం పవన్ పై ఉన్న అభిమానంతో వదులుకున్నారు. ఈ సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. అటు భూములిచ్చిన రైతులకు హెచ్చరికలు పంపింది. కానీ వారు వినలేదు. ఆవిర్భావ సభ కూడా విజయవంతమైంది. దీంతో ప్రభుత్వ పెద్దలు కొందరు ఎంటరయ్యారు. అసలు వాహనాలే వెళ్లని గ్రామంలో రోడ్డు విస్తరణ, ఆక్రమణల తొలగింపు అంటూ కొత్త కథ అల్లారు. ఇళ్లను తొలగించారు. దీంతో జనసేనాని పవన్ స్పందించారు. బాధితులకు అండగా నిలిచారు. వారి తరుపున పోరాటం కూడా చేశారు. బాధితులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున సాడం లేదు. ఆలోచనలు ఆస్థాయిలో ఉండటం లేదు. తాను.. తన పార్టీ.. తప్ప ఎవరూ ఉండకూడదన్న ఇరుకుగా ఆయన మనసు ఉంది. ప్రజలు ఈ నేరో మైండ్ ను సంస్కరించకపోతే ఈ జుగుప్సాకర రాజయం కూడా అందించారు. ఇంటా బయటా విమర్శలు రావడంతో ఇప్పటం విషయంలో కొద్దిరోజులుగా సైలెంట్ అయ్యారు.

    Ippatam Issue

    అయితే ఇప్పుడు జనసేన పదో వార్షికోత్సవాన్ని మచిలీపట్నంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సిద్ధమైంది. దీంతో ప్రభుత్వంలో ఒకరకమైన కలవరం ప్రారంభమైంది. మచిలీపట్నం సభతో పవన్ యుద్ధం ప్రకటిస్తారని నాదేండ్ల మనోహర్ ప్రకటించారు. దీంతో ఇప్పటం గ్రామస్థులను భయపెట్టి పవన్ కు గట్టి సంకేతాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.అయితే ఈ ఆలోచనల వెనుక పాలకుల నేరో మైండ్ ఉంది . ఒక చిన్న కుగ్రామంపై పాలకుల దండయాత్రలా మారింది. తాను ఐదు కోట్ల మంది ఆంధ్రులకు పాలకుడు అనుకోవకీయం మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఇప్పటమే.. ఇక ముందు ఇందులో తమ పార్టీ.. పరాయి పార్టీ అనే మినహాయింపులేమీ లేవని… చాలా ఉదాహరణల ద్వారా వెల్లడవుతోంది.

    Also Read:A. R. Rahman Son Ameen Accident: బ్రేకింగ్ : ఘోర ప్రమాదం నుండి తప్పించుకున్న సంగీత దర్శకుడు AR రెహ్మాన్ కొడుకు అమీన్