
Amigos Closing Collections: నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన ‘అమిగోస్’ చిత్రం ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది.వాస్తవానికి ఈ సినిమా అసలు ఫ్లాప్ అవ్వాల్సినది కాదు.టాక్ కూడా అంత నెగటివ్ గా ఏమి రాలేదు, కానీ ఆ జానర్ కి తగ్గట్టుగా సరైన ట్రైలర్ మరియు టీజర్ పడకపోవడం వల్లే ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోసింగ్ వరకు ఊహించిన దానికంటే దారుణమైన వసూళ్లు వచ్చాయి.’భింబిసారా’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడం తో ‘అమిగోస్’ చిత్రానికి కనీస స్థాయి వసూళ్లయినా రాబడుతుందని ట్రేడ్ ఆశించింది.
అందుకు తగ్గట్టుగానే డిఫరెంట్ జానర్ సినిమా అయ్యినప్పటికీ 15 కోట్ల రూపాయిల థియేట్రికల్ బిజినెస్ చేసింది.యావరేజి టాక్ వచ్చినా కూడా 10 కోట్ల రూపాయలకు పైగానే క్లోసింగ్ కలెక్షన్స్ వస్తాయని అంచనా వేశారు.కానీ ఆ అంచనాలన్నీ తారుమారు అయ్యాయి.దాదాపుగా అన్ని ప్రాంతాలలో క్లోజ్ అయిపోయిన ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత వరకు వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఫుల్ రన్ లో కేవలం ఆరు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయట.అంటే ఈ సినిమా కళ్యాణ్ రామ్ గత చిత్రం ‘భింబిసారా’ మొదటి వసూళ్లను క్లోసింగ్ లో కూడా అందుకోలేకపోయింది అన్నమాట.ఇంత పెద్ద భారీ డిజాస్టర్ అవుతుందని పాపం ‘అమిగోస్’ మూవీ టీం కూడా ఊహించి ఉండదు.

అఖండ చిత్రం నుండి వరుస విజయాలతో దూసుకుపోతున్న నందమూరి ఫ్యామిలీ కి పెద్ద స్పీడ్ బ్రేకర్ వేసింది ఈ చిత్రం.కేవలం నందమూరి ఫ్యామిలీ కి మాత్రమే కాదు, సంక్రాంతి కానుకగా రెండు భారీ సినిమాలను విడుదల చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన మైత్రి మూవీ మేకర్స్ సక్సెస్ స్ట్రీక్ కి కూడా ఈ సినిమా బ్రేకులు వేసింది.సుమారుగా నిర్మాతలకు థియేట్రికల్ బిజినెస్ రూపం లో 9 కోట్ల రూపాయిల నష్టాలు వచ్చాయట.