![]()
Pushpa song remix : సముద్రంలో ఉప్పుని, చెట్టు మీద ఉసిరిని, చేను లో ఎండు మిరపని కలపాలంటే ఎంత కష్టం? ఓసోస్ ఇది కూడా ఓ కష్టమేనా? దీనికి ఉసిరికాయ పచ్చడి పెట్టుకుంటే సరిపోతుంది కదా! అని అంటారా…ఎస్ మీరు చెప్పింది కరెక్టే.. ఇప్పుడున్న టెక్నాలజీతో ఒకదానికి ఒకటి సరిపడని వాటిని కలిపి కొత్తదాన్ని సృష్టిస్తున్నారు. దీనివల్ల పాతది అలాగే ఉంటోంది. కొత్తదనం యాడ్ కావడం వల్ల మనసుకు ఉల్లాసం కలుగుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ పై నిషేధం విధించడంతో మేటా కంపెనీ రీల్స్ ను అందుబాటులోకి తెచ్చింది.. ఇది కూడా ఆ టిక్ టాక్ లాంటిదే. కాకపోతే ఇది అమెరికా వాడిది. ఆ గోల మనకెందుకు గానీ.. ఈ రీల్స్ వల్ల కొత్త కొత్త కంటెంట్ వెలుగులోకి వస్తోంది..
జంబలకడి జారు మిఠాయి
ఆ మధ్య మంచు విష్ణు జిన్నా అని ఓ సినిమా తీశాడు.. ఆ సినిమా అడ్డంగా తన్నేసినా ఆ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కొంతమంది గ్రామీణ మహిళలు పాడిన పాటలు వైరల్ గా మారాయి.. ముఖ్యంగా జంబలకడి జారు మిఠాయి.. ఈ పాట ఆ సినిమాలో కంటే ఆ చిత్తూరు గ్రామీణ మహిళలు పాడటంతోనే బాగా పాపులర్ అయింది..ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ పాట ఏదో ఒక రూపంలో మనను పలకరిస్తూనే ఉంది. పైగా ఈ పాటను ఇతర పాటల్లో కొన్ని స్టెప్స్ కు యాడ్ చేయడంతో పాత సీసా లో కొత్త సారా లాగా కనిపిస్తోంది. చూసేవాళ్ల పేదాల పై నవ్వులు పూయిస్తొంది.
అల్లు అర్జున్ పాటను కూడా వదల్లేదు
ఈ జంబలకడి జారు మిఠాయి పాటను ఓ తింగరి వ్యక్తి పుష్ప సినిమాలో ” సామీ సామీ” పాటకు యాడ్ చేశారు.. ముఖ్యంగా రష్మిక తన పైట ను తీసి అల్లు అర్జున్ ను ట్రోల్ చేసే స్టెప్ కు ” నేను ఆడదాన్ని కాదంట్రా” అనే లైన్ ను యాడ్ చేశాడు. అది అచ్చుగుద్దినట్టు సరిపోయింది. చూసేవాళ్ళకు పుష్ప సినిమాలో ఈ పాట కూడా ఉందా? ఇది కాపీ చేసి జిన్నా లో పెట్టారా అనే విధంగా అనిపిస్తోంది. టెక్నాలజీ అంటే కొత్త వాటిని సృష్టించడం… కానీ మనవాళ్లు పాత వాటి నుంచే కొత్త వాటిని సృష్టిస్తున్నారు. తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతున్నారు.
View this post on Instagram