Homeట్రెండింగ్ న్యూస్America: అమెరికాలోనూ ఆరుబయటే బట్టలు ఆరేస్తున్నారు.. వీడియో వైరల్‌!

America: అమెరికాలోనూ ఆరుబయటే బట్టలు ఆరేస్తున్నారు.. వీడియో వైరల్‌!

America: అమెరికా.. అనగానే అభివృద్ధి చెందిన దేశం.. టెక్నాలజీ ఉన్న దేశంగా గుర్తింపు ఉంది. అన్ని విషయాల్లో టెక్నాలజీని విపరీతంగా వాడతారని అంటారు. అయితే అక్కడ కూడా అన్ని దేశాల్లో ఉన్నట్లే రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి. ఇక అక్కడ బట్టలు ఆరబెట్టేందుకు డ్రై క్లీనర్స్‌ వాడతారు. కానీ, అక్కడ ఓ కుటుంబం ఆరుబయట బట్టలు ఆరబెట్టిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది.

Also Read: ట్రంప్ టారిఫ్ దెబ్బ బజాజ్, మహీంద్రా, రాయల్ ఎన్‎ఫీల్డ్‎లకు ఎందుకు ఉండదు ?

ఒక అమెరికన్‌(American)ఇంటి వెనుక ప్రాంగణంలో బట్టలు ఆరబెట్టడాన్ని చూపిస్తూ, ‘భారతదేశం కాదు, ఇది అమెరికా‘ అనే టెక్స్‌ట్‌తో పాటు షాక్‌ ఎమోజీ కనిపిస్తుంది. భారతీయ సంతతికి చెందిన మొహమ్మద్‌ అనాస్‌(Mohmad anas) అనే యూజర్‌ ఈ వీడియోను షేర్‌ చేశాడు. అతను విద్యార్థులకు అమెరికాలో స్థిరపడటానికి సహాయం చేస్తానని చెబుతూ, ఈ దృశ్యాన్ని భారతదేశంతో పోల్చవద్దని సూచించాడు. కెండ్రిక్‌ లామర్‌ యొక్క ‘నాట్‌ లైక్‌ అస్‌’ పాట నేపథ్యంలో ఈ వీడియో సెట్‌ చేయబడింది.
ఈ వీడియో సోషల్‌ మీడియా(Social Media)లో విస్తృతంగా షేర్‌ కాగా, వినియోగదారుల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. చాలామంది ఈ పోలికను అర్థం చేసుకోలేకపోయారు. ఒక వినియోగదారు, ‘అమెరికన్లు తమ బట్టలు ఆరబెట్టరా?‘ అని ప్రశ్నించగా, మరొకరు, ‘క్షమించండి, బట్టలు ఆరబెట్టడం చట్టవిరుద్ధమా లేదా ఏదైనా?‘ అని వ్యంగ్యంగా అడిగారు. మూడవ వ్యక్తి, ‘నేను గందరగోళంలో ఉన్నాను. అమెరికాలో ఇలా చేయకూడదా?‘ అని రాశారు. ఈ ప్రతిస్పందనలు వీడియో ఉద్దేశ్యంపై సందేహాలను లేవనెత్తాయి.

సాధారణమే అయినా..
ప్రపంచవ్యాప్తంగా బట్టలు ఆరబెట్టడం సాధారణం అయినప్పటికీ, ఈ వీడియో అమెరికాలో దీన్ని అసాధారణంగా చిత్రీకరించడం వివాదానికి కారణమైంది. వాషింగ్టన్‌ డీసీలో జరిగిన ఈ ఘటన మార్చి 28, 2025న తొలిసారి ప్రచురితమైంది. అమెరికాలో డ్రైయర్లు సర్వసాధారణం అయినప్పటికీ, వెనుక ప్రాంగణంలో బట్టలు ఆరబెట్టడం అరుదైనది కాదు. అయితే, ఈ వీడియో భారతదేశంతో పోల్చడం వల్ల సాంస్కతిక అవగాహనపై చర్చ మొదలైంది.

ఈ సంఘటన సోషల్‌ మీడియా ద్వారా సాధారణ విషయాలను ఎలా వివాదాస్పదంగా మార్చవచ్చో చూపిస్తుంది. బట్టలు ఆరబెట్టే పద్ధతి ఒక సంస్కతిని నిర్వచించదని, అలాంటి పోలికలు అనవసరమని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. చివరగా, ఈ వీడియో ఒక సామాన్య దశ్యాన్ని అసాధారణంగా చిత్రీకరించి, సరళమైన అంశంపై పెద్ద చర్చను రేకెత్తించింది.

 

View this post on Instagram

 

A post shared by Mohammad Anas (@md24_anas)

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular