ఎంటర్టైన్మెంట్Avatar 2: అవతార్ 2 నిర్మాణం వెనకున్న అద్భుత విశేషాలు ఎన్నో...!

Avatar 2: అవతార్ 2 నిర్మాణం వెనకున్న అద్భుత విశేషాలు ఎన్నో…!

Avatar 2: 2009లో ప్రపంచ సినిమా ఓ అద్భుతాన్ని చూసింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో విడుదలైన అవతార్, మూవీ లవర్స్ ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. భూమిని వీడి జీవం ఉన్న మరో గ్రహంలోకి వెళితే ఇలానే ఉంటుందేమో అన్నంతగా కామెరూన్ ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేశారు. గాల్లో వేలాడే కొండలు. మెరిసే అడవులు, దగ్గరగా కనిపించే గ్రహాలు, విచిత్ర జంతువులు… అన్నింటికీ మించి నీలి రంగులో తోక కలిగిన పది అడుగుల మనుషులను పోలిన జాతి. మనుషుల ఊహకు తెలియని కొత్త ప్రపంచం కామెరూన్ సృష్టించాడు. అవతార్ సినిమాకు ప్రేక్షకులు దాసోహం అన్నారు. 2.92 బిలియన్ డాలర్స్ వసూళ్లతో వరల్డ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

Avatar 2
Avatar 2

ఈ క్రమంలో అవతార్ సీక్వెల్ పై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అవతార్ చిత్రానికి మించి అవతార్ 2 ఉండేలా జేమ్స్ కామెరూన్ రూపొందించాలి అనుకున్నారు. పార్ట్ 2 థియేటర్స్ లోకి తేవడానికి ఆయన ఏకంగా 13 ఏళ్ల సమయం తీసుకున్నారు. డిసెంబర్ 16న వరల్డ్ వైడ్ విడుదలైన అవతార్ ది వే ఆఫ్ వాటర్… నిర్మాణం వెనుక అద్భుత విషయాలెన్నో ఉన్నాయి అవేమిటో చూద్దాం…

అవతార్ 2 బడ్జెట్ 250 మిలియన్ డాలర్స్. భారత కరెన్సీలో అక్షరాల రూ. 2067 కోట్లు. ఐదు ఆర్ ఆర్ ఆర్ చిత్రాల బడ్జెట్ తో సమానం. ఇది అవతార్ 1 కంటే అధికం. అవతార్ చిత్ర బడ్జెట్ 237 మిలియన్ డాలర్స్. అవతార్ విడుదలకు ముందే అనేక అంతర్జాతీయ అవార్డ్స్ అందుకుంది. ప్రపంచ సినిమా వేదికపై అవతార్ 2 సత్తా చాటింది. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ నామినేషన్స్ అవతార్ 2 దక్కించుకుంది. జ్యూరీ సభ్యులు బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామా, బెస్ట్ డైరెక్టర్ విభాగాల్లో నామినేట్ చేశారు.

చైనాలో హాలీవుడ్ చిత్రాలకు పెద్దగా మార్కెట్ ఉండదు. మేకర్స్ అక్కడ విడుదల చేసేందుకు ఆసక్తి చూపించరు. అవతార్ 2 చైనాలో భారీ ఎత్తున విడుదలైంది. ప్రీ బుకింగ్స్ లో అవతార్ 2 దుమ్మురేపింది. వరల్డ్ వైడ్ అవతార్ సీక్వెల్ 160 భాషల్లో విడుదలైంది. భారత్ లో ఆరు భాషల్లో విడుదల చేశారు. టైటానిక్ మూవీలో హీరోయిన్ గా నటించిన కేట్ విన్స్లెట్ అవతార్ 2 మూవీలో కీలక రోల్ చేశారు. 25 ఏళ్ల తర్వాత కామెరూన్-కేట్ విన్స్లెట్ కలిసి మూవీ చేశారు.

Avatar 2
Avatar 2

తన క్రియేటివిటీకి తెర రూపం ఇచ్చేందుకు సోని కంపెనీతో కలిసి కామెరూన్ సరికొత్త కెమెరా డెవలప్ చేయించారు. నీటిలో అధిక భాగం షూట్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో నటులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. అవతార్ ప్రాంచైజీలో అవతార్: ది సీడ్ బేరియర్, అవతార్: టుకున్ రైడర్, అవతార్: ది క్వెస్ట్ ఫర్ ఎవా అనే మరో మూడు చిత్రాలు రానున్నాయి.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Most Popular

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి ని పట్టించుకోని స్టార్ హీరోలు వీళ్లే…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీ లో కమర్షియల్ డైరెక్టర్స్ కి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే వాళ్లు హీరోలను పర్ఫెక్ట్ టెంప్లేట్ లో చూపిస్తూ ఉంటారు. ఒక ఫైట్ తర్వాత ఒక...

Ravi Teja : కూతురుతో కలిసి ‘ఇరుముడి’ కి డబ్బింగ్ చెప్తున్న రవితేజ.. వీడియో వైరల్..

Ravi Teja : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' పై మార్కెట్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ బజ్ ఏర్పడింది. సుబ్రమణ్యస్వామి బ్యాక్ డ్రాప్ లో...
Exit mobile version