Allu Arjun Wife Sneha Reddy: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ ని సైతం తలదన్నే అందం అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సొంతం..ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యినప్పటికీ కూడా ఆమె అందం ఇసుమంత కూడా తగ్గలేదు..మోడరన్ గెటప్ వేస్తె ఈమె అందం ముందు ఏ స్టార్ హీరోయిన్ కూడా నిలబడలేకపోతుంది..పూజ హెగ్డే , రష్మిక వంటి స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్ళుకునే స్థాయి స్నేహ రెడ్డిడి అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇంత అందం పెట్టుకొని కూడా సినిమాల్లో నటించకపోవడం ఏమిటి..నటిస్తే తప్పేమిటి? అని సోషల్ మీడియా లో ఆమె పెట్టే ఫోటోల క్రింద అభిమానులు కామెంట్స్ పెడుతూ ఉంటారు..దీనిపై స్నేహ రెడ్డి ఇప్పటి వరుకు ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు..అయితే ఈమె ఇప్పుడు డైరెక్ట్ గా హీరోయిన్ గానే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని ఇప్పుడు ఇండస్ట్రీ లో వినిపిస్తున్న హాట్ టాపిక్..భర్త అల్లు అర్జున్ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.
ఇక అసలు విషయానికి వస్తే మలయాళం స్టార్ హీరో పృద్వి రాజ్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం లో స్నేహా రెడ్డి హీరోయిన్ గా నటిస్తున్నట్టు సమాచారం..ఈ చిత్రం తెలుగు మరియు మలయాళం బాషలలో ఏకకాలం లో నిర్మాణం జరుపుకోబోతుందట..అయితే ఈ సినిమాలో స్నేహా రెడ్డి నటించడానికి ఒక కండిషన్ మీదనే ఒప్పుకుందట..సినిమాలో ఎలాంటి అందాల ఆరబోత ఉండకూడదు..నటనకి ప్రాధాన్యం ఉన్నట్టు అయితేనే చేస్తాను అని చెప్పిందట..అలాంటి పాత్ర కాబట్టే మీ దగ్గరకి వచ్చాము..ఒకసారి కథ వినండి అని ఆమెకి స్టోరీ మొత్తం చెప్పి ఒప్పించారట.

అల్లు అర్జున్ కూడా నీకు ఎలా చెయ్యాలి అనిపిస్తే అలా చెయ్యి..నేను నిన్ను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తాను అని ధైర్యం చెప్పాడట..అలా ఈ సినిమా ఓకే అయిపోయింది..స్నేహా రెడ్డి గారు కేవలం ఈ సినిమాతోనే సరిపెడుతారా..లేక మరిన్ని పాత్రలు తెలుగు లో కూడా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది..అయితే అల్లు అర్జున్ – స్నేహా రెడ్డి హీరోహీరోయిన్లు గా కలిసి చేస్తే చూడాలని ఉంది అని అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు..మరి వారి కోరిక కూడా నెరవేరుతుందా లేదో చూడాలి.