Allu Arjun Daughter Arha: మహేష్ బాబు- అల్లు అర్జున్ టాలీవుడ్ టాప్ స్టార్స్ గా ఉన్నారు. వీరిద్దరి అభిమానుల మధ్య పచ్చ గడ్డేస్తే భగ్గుమనేంత పరిస్థితి ఉంటుంది. తరచుగా సోషల్ మీడియాలో కొట్టుకుంటూ ఉంటారు. ఈ హీరోల అభిమానుల ఫ్యాన్ వార్స్ చాలా సాధారణంగా జరుగుతుంటాయి. 2020లో థియేటర్స్ పంపకాల విషయంలో మహేష్-అల్లు అర్జున్ లకు మనస్పర్థలు తలెత్తాయి. ఆ ఏడాది సంక్రాంతికి అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు విడుదలయ్యాయి.సంక్రాంతి విన్నర్ నేనంటే నేనంటూ పోస్టర్స్ విడుదలు చేస్తూ కొట్టుకున్నారు. అప్పటి నుండి మహేష్-అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గ్యాప్ మరింత పెరిగింది.

ఇటీవల అల్లు అర్జున్, మహేష్ దర్శకుడు గుణశేఖర్ కూతురు నీలిమ గుణ వివాహ రిసెప్షన్ కి హాజరయ్యారు. దాదాపు ఇద్దరూ ఒకే సమయంలో వేదిక వద్దకు చేరుకున్నారు. మహేష్-అల్లు అర్జున్ లు కలిసి నూతన దంపతులతో ఫోటోలు దిగారు. అయినప్పటికీ ఇద్దరూ పలకరించుకోలేదనే టాక్ ఉంది. ఈ క్రమంలో మహేష్ మూవీలో అల్లు అర్హ నటిస్తున్నారనే న్యూస్ ఆసక్తిరేపుతోంది. మహేష్-త్రివిక్రమ్ మూవీలో కీలకమైన చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ కోసం అర్హను తీసుకున్నారని టాలీవుడ్ టాక్.
దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. మహేష్ మూవీలో అల్లు అర్జున్ కూతురు నటిస్తే ప్రముఖంగా చెప్పుకుంటారు. అది చిత్రానికి మరికొంత ప్రచారం కల్పిస్తుంది. ఆల్రెడీ అర్హ శాకుంతలం మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మారారు. సమంత-గుణశేఖర్ కాంబో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం శాకుంతలంలో అర్హ ఒక పాత్ర చేస్తుంది. శాకుంతలం మూవీ జనవరి 17న ఐదు భాషల్లో విడుదల కానుంది.

ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముగించుకొని ఇండియా వచ్చిన మహేష్ త్వరలో త్రివిక్రమ్ మూవీ షూట్ లో పాల్గొననున్నారు. పలు కారణాలతో అనుకున్న సమయానికి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళలేదు. 2023 సమ్మర్ కానుకగా విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. కనీసం ఒక షెడ్యూల్ కంప్లీట్ కాలేదు. కాబట్టి అది అసాధ్యం. సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. అలాగే సీనియర్ హీరోయిన్ శోభన మహేష్ తల్లి పాత్ర చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి