
Allu Family Celebrations: టాలీవుడ్ లో పార్టీల ట్రెండ్ నడుస్తోంది. ఒకరి తర్వాత ఒకరు గ్రాండ్ పార్టీలు ఇస్తున్నారు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే కాగా ఇండస్ట్రీ మొత్తానికి భారీ ట్రీట్ ఇచ్చారు. చిరంజీవి నివాసంలో జరిగిన రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ హాజరయ్యారు. దర్శకులు, నిర్మాతలు, హీరోలు కొలువుదీరారు. ఆర్ ఆర్ ఆర్ టీమ్ ని చిరంజీవి దంపతులు ప్రత్యేకంగా అభినందించారు. ఆస్కార్ గెలిచిన నేపథ్యంలో సన్మానించడమైంది. ఇటీవల ఎన్టీఆర్ మరో పార్టీ ఏర్పాటు చేశారు. ఇది రామ్ చరణ్ బర్త్ డే పార్టీ అంత గ్రాండ్ గా కాకపోయినా భారీగానే జరిగింది.
ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన డిన్నర్ నైట్ పార్టీలో రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివతో పాటు పలువురు చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ పార్టీ ఇవ్వడం వెనుక కారణమయితే తెలియలేదు. కాగా టాలీవుడ్ బడా ఫ్యామిలీస్ లో ఒకటైన అల్లువారు కూడా ఓ వేడుకకు సిద్ధం అవుతున్నారట. అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఈ మేరకు ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. అయితే ఇది పార్టీ కాదు, ఫంక్షన్ అంటున్నారు. కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనే ఈ వేడుకకు పరిశ్రమ ప్రముఖులకు కూడా ఆహ్వానం ఉంటుందనే ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
అల్లు వారి ఫ్యామిలీ సడన్ గా ఫంక్షన్ నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏముంది? అల్లు శిరీష్ పెళ్లి…లేదా ఇతర ముఖ్యమైన వేడుక అయితే ముందుగానే చెబుతారు కదా? అనే చర్చ మొదలైంది. అదే సమయంలో ఇది అల్లు-మెగా ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ టైప్ ఫంక్షన్ కూడా కావొచ్చని మరొక వాదన. ఇటీవల ఈ రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలు వచ్చాయని ప్రచారం జరుగుతుండగా… ఈ వేడుకతో చెక్ పెట్టే ఆలోచన కావచ్చని అంటున్నారు.

అయితే అల్లువారు వేడుక నిర్వహిస్తున్నట్లు ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కేవలం పరిశ్రమలో వినిపిస్తుంది. ఒకవేళ ఫంక్షన్ ఏర్పాటు చేస్తే… చిరంజీవి, రామ్ చరణ్ హాజరువుతారో లేదో చూడాలి. రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి అల్లు అర్జున్ హాజరు కాలేదు. కనీసం సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెప్పలేదు. చరణ్, అల్లు అర్జున్ మధ్య గ్యాప్ ఉంది అనడానికి ఇదే రుజువు అంటూ పుకార్లు వినిపించాయి. ఒక వేళ అల్లు అర్జున్ ఫంక్షన్ ఏర్పాటు చేసి దానికి చరణ్ రాకుంటే ఈ అనుమానాలు మరింత బలపడతాయి.