Homeఎంటర్టైన్మెంట్Pushpa 2 Review: 'పుష్ప 2' ఫుల్ మూవీ రివ్యూ...

Pushpa 2 Review: ‘పుష్ప 2’ ఫుల్ మూవీ రివ్యూ…

Pushpa 2 The Rule Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక ఇదే రీతిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… గత మూడు సంవత్సరాల క్రితం పుష్ప సినిమాతో వచ్చిన ఆయన పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. ఇక ఈరోజు ‘పుష్ప 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించే విధంగా ఉందా లేదా అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే సిండికేట్ రారాజుగా వెలుగొందుతున్న పుష్ప రాజ్ తన భార్య కోరిక మేరకు సీఎంతో ఒక ఫోటో దిగాలని అనుకుంటాడు. కానీ సీఎం మాత్రం పుష్ప లాంటి ఒక స్మగ్లర్ తో ఫోటో దిగితే తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఫోటో దిగడానికి ఇష్టపడడ. ఇక దాంతో హర్ట్ అయిన పుష్ప అప్పట్నుంచి సిఎం ను గద్దె దించాలనే ప్రయత్నం చేస్తుంటాడు.ఇక తనకు ఆప్తుడు అయిన రావు రమేష్ ను సిఎం చేస్తానని మాట ఇస్తాడు…ఇక ఇలాంటి సందర్భంలోనే అతను సరుకుని సిండికేట్ లో కాకుండా డైరెక్ట్ గా ఓవర్సీస్ లోనే అమ్మాలని డిసైడ్ అవుతాడు.మరి పుష్ప అనుకున్నట్టుగా సీఎంను మార్చారా లేదా తన ఫ్యామిలీతో పాటు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికొస్తే ఈ సినిమా దర్శకుడు అయిన సుకుమార్ ఈ సినిమాలో ఏదైతే పాయింట్ ను ఎలివేట్ చేసి చెప్పాలనుకున్నాడో దాన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు. ఇక మొత్తానికైతే ఆయన తనదైన రీతిలో మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమాని అల్లు అర్జున్ అభిమానులకు అందించాడనే చెప్పాలి… ఇక పుష్ప మొదటి పార్ట్ ఎంత అయితే సక్సెస్ అయిందో దానికి ఏమాత్రం తీసుపోకుండా ఈ సినిమాని కూడా తీర్చిదిద్దిన వైనం ప్రేక్షకులందర్నీ మెప్పిస్తుంది… ఇక సుకుమార్ గత సినిమాల్లో మాదిరిగా ఈ సినిమాలో ఎలాంటి క్యాలిక్యులేషన్స్ పెట్టకుండా సగటు ప్రేక్షకుడికి సైతం సినిమా అర్థమయ్యే రేంజ్ లో ఒక కమర్షియల్ సినిమా అయితే తీశాడు….

అతను అనుకున్న పాయింట్ ను ఎక్కడ డివియేట్ అవ్వకుండా చెప్పే రీతిలో సుకుమార్ చాలావరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక శ్యామ్ సిఎస్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని ఎమోషనల్, ఎలివేషన్స్ సీన్స్ కి కి చాలా బాగా వర్క్ అవుట్ అయిందనే చెప్పాలి. నిజానికి పుష్పరాజ్ యొక్క క్యాలిబర్ ఏంటి అనేది సుకుమార్ మనకి ఈ సినిమాలో చాలా స్ట్రాంగ్ గా చూపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ లో అల్లు అర్జున్ బన్వర్ సింగ్ షేకావత్ తో చాలెంజ్ చేసే సీన్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక దాంతో పాటుగా గంగాలమ్మ జాతరలో వచ్చే సీక్వెన్స్ ను చాలా బాగా తెరకెక్కించారు. ఇక వాళ్ళ ఫ్యామిలీతో పుష్పరాజ్ కి మధ్య ఉన్న ఎమోషన్ సీన్స్ ని కూడా సుకుమార్ చాలా సెటిల్డ్ గా బ్యాలెన్స్ చేశారనే చెప్పాలి. ఇక పుష్ప రాజ్ విషయంలో ఎలాంటి సందేహాలు లేకుండా చాలా క్లియర్ కట్ గా అతని క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా ఆయన ఎలా రూల్ చేస్తున్నాడనేది కూడా చాలా బాగా చూపించారు…

సుకుమార్ లాంటి దర్శకుడి నుంచి ఇలాంటి అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ సినిమాని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే ఆయన ఈ రేంజ్ లో సినిమాని తెరకెక్కిస్తారని ఎవరు అనుకోలేదు. ఇక ఈ సినిమా అవుట్ అఫ్ ది బాక్స్ వెళ్లిపోయిందనే చెప్పాలి… ఇక ఈ సినిమాలో ఉన్న కోర్ ఎమోషన్ ని మాత్రం చాలా హైలెట్ చేస్తూ సుకుమార్ రాసుకున్న కొన్ని సీన్లు ప్రతి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా ఉన్నాయి… ప్రతి సీన్ లో కూడా పుష్పరాజ్ ఒక హీరో హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి సుకుమార్ ప్రయత్నం చేశాడు. పుష్పరాజ్ అనే ఒక వ్యక్తి సిండికేట్ లో తన హవాని ఎలా కొనసాగిస్తున్నాడు సగటు జనాలతో ఎలా ఉంటున్నాడనేది మన కళ్లకు కట్టినట్టుగా చూపించాడు… ఇక ఈ సినిమాలో ఫైట్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. నిజానికి క్లైమాక్స్ ఫైట్ అయితే ఎంటైర్ సినిమాకే హైలెట్ గా నిలిచిందనే చెప్పాలి…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే అల్లు అర్జున్ మరోసారి రఫ్పాడించాడనే చెప్పాలి. ఎంటైర్ సినిమా మొత్తాన్ని తను ఒక్కడే ఆయన భుజాల మీద మోసుకెళ్లాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వచ్చిన ఆయన అతి అనిపించకుండా చాలా ఎక్స్ట్రాడినరీగా నటించి మెప్పించాడు. ఒక మాస్ వ్యక్తి ఎలాగైతే ఉంటాడో అతను సిండికేట్ లో రాజు అయినా కూడా ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది. ఇతరులతో ఎలా మాట్లాడుతాడనే విషయాలను చాలా క్లియర్ కట్ గా పరిశీలించి మరి తను చేసినట్టుగా తెలుస్తోంది. పుష్ప సినిమాలో ఆయనకు ‘నేషనల్ అవార్డు’ అయితే వచ్చింది. కానీ ఈ సినిమాలో అంతకుమించి నటించి మెప్పించాడనే చెప్పాలి… కొన్ని సీన్లలో ఆయన పర్ఫామెన్స్ చూస్తే నిజంగా అల్టిమేట్ అనే చెప్పాలి…

ఇక ఒక క్యారెక్టర్ లో మొదటి నుంచి చివరి వరకు ట్రావెల్ అవ్వాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని… కానీ అల్లు అర్జున్ దాన్ని ఈజీగా చేసుకుంటూ వచ్చాడు. అందుకే ఆయనకి ఒక సపరేట్ ఐడెంటిటీ అనేది క్రియేట్ అయింది… ఇక పుష్పరాజ్ భార్యగా చేసిన రష్మిక మందాన కూడా తన క్యారెక్టర్ పరిధి మేరకు చాలా అద్భుతంగా నటించింది. పుష్ప భార్య అంటే ఎలా ఉండాలో చూపించడమే కాకుండా ఆ రాజసాన్ని కూడా చూపిస్తూ ప్రేక్షకులు చేత శభాష్ అనిపించుకుంది… ఇక రావు రమేష్ కూడా చాలా సెటిల్డ్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. పొలిటీషియన్ గా ఆయన నటించిన తీరు అద్భుతం అనే చెప్పాలి. ఇక సునీల్ కు అంత మంచి పర్ఫామెన్స్ ఇవ్వడానికి స్కోప్ అయితే లేదు. కానీ ఉన్న దాంట్లో మాత్రం ఒకే అనిపించాడు.

ఇక ఫాహాద్ ఫజిల్ అద్భుతమైన నటనని కనబరిచాడు. ముఖ్యంగా ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ తో అక్కడక్కడ కామెడీ ని పంపించడమే కాకుండా విలనిజాన్ని కూడా పండిస్తూ ప్రేక్షకుల చేత క్లాప్స్ కొట్టించాడు… ఇక అనసూయ కూడా ఒక సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక అజయ్ కనిపించింది చాలా తక్కువ సమయం అయినప్పటికీ అతని పాత్రలో ఆయన ఒదిగిపోయి నటించాడు…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి థియేటర్లో సాంగ్స్ వచ్చిన ప్రతిసారి అభిమానులు ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో దేవిశ్రీప్రసాద్ ఇలాంటి మంచి మ్యూజిక్ అయితే ఇవ్వలేదనే చెప్పాలి. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కొన్ని ఎలివేషన్ సీన్స్ కి మాత్రం చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు… ఇక మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఒక్కో సీన్ కోసం వాళ్ళు భారీగా ఖర్చుపెట్టినట్టుగా ఆ సినిమాను చూస్తుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది…

ప్లస్ పాయింట్స్

అల్లు అర్జున్
ఇంటర్వెల్
గంగాలమ్మ జాతర
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది…
కామెడీ లేకపోవడం…

రేటింగ్

ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 3/5

చివరి లైన్

పుష్ప రాజ్ రికార్డుల వేటలో నీ అవ్వ తగ్గేదేలే…

 

Pushpa 2 The Rule Trailer (Telugu) | Allu Arjun | Sukumar | Rashmika Mandanna | Fahadh Faasil | DSP

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version