
Allu Arjun : ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న హీరోలలో ఒకడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.పుష్ప సినిమా తో ఆయన సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది.ఇప్పటికీ ఈ సినిమా మేనియా ఇండియా లో ఎదో చోట కనిపిస్తూనే ఉంటుంది.ప్రస్తుతం పుష్ప 2 కోసం దేశం మొత్తం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తుంది.
ఇది ఇలా ఉండగా హైదరాబాద్ అమీర్ పేట్ లోని సత్యం థియేటర్ ని కూల్చివేసి చాలా రోజులైనా సంగతి అందరికీ తెలిసిందే.ఎంతో ప్రసిద్ధి గాంచిన ఆ గొప్ప థియేటర్ స్థానం లో ఇప్పుడు అల్లు అర్జున్ సరికొత్త హంగులతో ఒక ఆసియన్ సినిమాస్ తో కలిసి ఒక భారీ ముల్టీప్లెక్స్ ని నిర్మించాడు.మరో రెండు రోజుల్లోనే ఈ మల్టిప్లెక్స్ ఘనంగా ప్రారంభం కాబోతుంది.ముఖ్య అతిధులుగా ఎవరు హాజరు కాబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ ఈ మల్టిప్లెక్స్ లో తనకి సంబంధించిన ఒక విగ్రహం ని ఏర్పాటు చెయ్యిస్తున్నాడట.తన విగ్రహాన్ని తానే తయారు చేయించడం, ఇదేమి పిచ్చి రా బాబు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు.కానీ ఇది విర్చువల్ విగ్రహం అని తెలుస్తుంది,ఈ విగ్రహం ముందుకి వెళ్లి మనం నిల్చొని ఏదైతే చేస్తామో, అందుకు అనుగుణంగా సమాధానం చెప్తుంది.మొత్తం మీద అల్లు అర్జున్ అక్కడ లేకపోయినా, ఉన్నట్టుగా ఫీలింగ్ ని రప్పిస్తుంది ఈ విగ్రహం.అత్యాధునిక టెక్నాలజీ తో తయారు చేయించిన ఈ విగ్రహాన్ని రేపు ప్రతిష్టించనున్నారట.5 స్క్రీన్స్ తో నిర్మితమవుతున్న ఈ మల్టిప్లెక్స్ హైదరాబాద్ లోనే ఒక బ్రాండ్ గా మారబోతుందని తెలుస్తుంది.
ఇప్పటికే ఆసియన్ సినిమాస్ మహేష్ తో కలిసి గచ్చిబౌలి ప్రాంతం లో ‘AMB సినిమాస్’ నిర్మించారు, ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో కలిసి మహబూబ్ నగర్ లో ‘AVD సినిమాస్’ నిర్మించాడు..ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చింది.ఈ మల్టిప్లెక్స్ కూడా సక్సెస్ అయ్యి హైదరాబాద్ లో బ్రాండ్ గా మారుతుందా లేదా అనేది చూడాలి.