
Indian Idol : మ్యూజిక్ షోలు కూడా కామెడీ షోలు అయిపోతున్నాయి. తెలుగు ఇండియన్ ఐడల్ పేరుతో ఆహాలో మ్యూజిక్ షో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది జూన్ లో ఫస్ట్ సీజన్ ఫినాలే ముగిసింది. సింగర్ వాగ్దేవి టైటిల్ గెలుచుకుంది. ఇటీవల సీజన్ 2 ప్రకటించారు. థమన్, గీతా మాధురి, సింగర్ కార్తీక్ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ కి గొప్ప సింగర్ ఒకరు వచ్చారు. అతడు ‘గంగోత్రి’ చిత్రంలోని ‘ఒక తోటలో’ సాంగ్ అందుకున్నాడు. మనోడు టాలెంట్ చూసి ఆర్కెస్ట్రా కు మైండ్ పోయింది. ఏం వేయించకుండా అలానే ఉండిపోయారు.
జడ్జెస్ గా ఉన్న థమన్, గీతా మాధురి, కార్తీక్ కి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. సరే పాడమంటే… సాంగ్ లో ఉన్నట్లు ఆర్కెస్ట్రా టీం మ్యూజిక్ కొట్టడం లేదని కంప్లైంట్ చేశాడు. పోనీ ఎలా కొట్టాలో నువ్వు చెప్పని, థమన్ అడిగాడు. అదే యూట్యూబ్ లో ఎలా వస్తుందో అలా కొట్టాలి, అని నెమ్మదిగా సిగ్గుపడుతూ సమాధానం చెప్పాడు. దాంతో జడ్జెస్ ముగ్గురూ కిందపడి నవ్వుకున్నారు. ఆడిషన్స్ లో జరిగిన ఈ ఫన్నీ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
నిజంగా ఎలాంటి టాలెంట్ లేని సింగర్ ఆడిషన్స్ వరకూ వచ్చాడా? లేక ఫన్ కోసం అతన్ని పంపారా? అనేది అర్థం కాలేదు. కొందరైతే ఆ వీడియో చూసి తెలుగు ఇండియన్ ఐడల్ షోపై విమర్శలు చేస్తున్నారు. ఇది వేస్టు షో, టైం దండగ అంటున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ వన్ బాగానే సక్సెస్ అయ్యింది. అందుకే సీజన్ 2 గ్రాండ్ గా లాంచ్ చేశారు. సీజన్ వన్ లో హీరోయిన్ నిత్యా మీనన్ కూడా జడ్జిగా చేశారు. సెకండ్ సీజన్ నుండి ఆమెను తప్పించారు.
ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతుండగా… త్వరలో కాంపిటీషన్ మొదలుకానుంది. అల్లు అరవింద్ ఆహా యాప్ ని డెవలప్ చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాడు. హిట్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు, రియాలిటీ షోలు, టాక్ షోలు, డైలీ సీరియల్స్ అందిస్తున్నారు. అంతర్జాతీయ ఓటీటీ యాప్ లకు ఆహా పోటీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బాలయ్య హోస్ట్ గా ప్రసారమైన అన్ స్టాపబుల్ సీజన్ 1 అండ్ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యాయి
View this post on Instagram