https://oktelugu.com/

Allu Arjun Diwali Party : అల్లు అర్జున్ ఇంట్లో దీపావళి సందడి.. షేక్ చేస్తున్న ఫొటోలు,వీడియోలు

Diwali buzz at Allu Arjun’s house: దీపావళిని దేశమంతా సంబరంగా జరుపుకుంటున్నారు. వెలుగుల పండుగ వేళ ఆనందోత్సాహాలతో సందడి చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు అంగరంగవైభవంగా నిర్వహించుకుంటున్నారు. మధ్య తరగతి నుంచి సెలబ్రిటీల వరకు తమ స్థాయికి తగినట్లు పండుగ కాంతులు పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తారల ఇళ్లు మాత్రం తళుకుంటున్నాయి. వెలుగుల మధ్య దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. సినీతారల ఇళ్లు కూడా జిగేలుమంటున్నాయి. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లో కూడా సంబరాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 24, 2022 / 08:25 PM IST
    Follow us on

    Diwali buzz at Allu Arjun’s house: దీపావళిని దేశమంతా సంబరంగా జరుపుకుంటున్నారు. వెలుగుల పండుగ వేళ ఆనందోత్సాహాలతో సందడి చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు అంగరంగవైభవంగా నిర్వహించుకుంటున్నారు. మధ్య తరగతి నుంచి సెలబ్రిటీల వరకు తమ స్థాయికి తగినట్లు పండుగ కాంతులు పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తారల ఇళ్లు మాత్రం తళుకుంటున్నాయి. వెలుగుల మధ్య దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. సినీతారల ఇళ్లు కూడా జిగేలుమంటున్నాయి.

    ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లో కూడా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఆయన ఇంట్లో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగ వేళ ఎంతో మంది ఆయన ఇంటికి చేరుకుని శుభాకాంక్షలు చెబుతున్నారు. దీపావళి సంబరం దేశమంతటా జరుగుతోంది. బన్నీ ఆయన సతీమణి స్నేహారెడ్డి పండుగలో సందడి చేశారు. మెగా కుటుంబ సభ్యులు కూడా హాజరై సంబరాలు చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం అర్జున్ ఇంట్లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు.

    దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. హాస్య నటుడు వైవా హర్ష ఇంట్లో కూడా దీపావళి వేడుకలు నిర్వహించారు. ఇందులో సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సందీప్ కిషన్, శ్రీకాంత్, మధుశాలినీ సందడి చేశారు. హైదరాబాద్ లో జరిగిన వేడుకలకు పలువురు హాజరై ఎంతో సందడిగా గడిపారు. దీపావళి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి కూడా హీరోయిన్లకు తగ్గని విధంగా ముస్తాబయ్యారు. అందరిని ఆహ్వానించి వారిని ఆప్యాయంగా పలకరించింది.

    ఫాంహౌస్ లో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. అల్లు అర్జున్, స్నేహారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరికి మర్యాదలు చేశారు. మెగా కుటుంబం నుంచి రాంచరణ్, ఉపాసన వచ్చారు. స్నేహ లుక్స్ చూసి అందరు ఫిదా అయ్యారు. హీరోయిన్లకు తీసిపోని అందంతో ఆమె పార్టీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వీరి పార్టీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల ప్రభావం పెరగడంతో ఏం చేసినా క్షణాల్లో ప్రేక్షకుల చెంతకు చేరడం గమనార్హం.