Homeఎంటర్టైన్మెంట్Allu Arha: పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో.. అల్లు అర్హ అరుదైన రికార్డు

Allu Arha: పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో.. అల్లు అర్హ అరుదైన రికార్డు

Allu Arha: అల్లు అరవింద్ మనవరాలు, అల్లు అర్జున్ – స్నేహా రెడ్డి ల గారాలపట్టి అర్హ సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అర్హ ముద్దు ముద్దు మాటలని, అల్లరి చేష్టలని ఎప్పటికప్పుడు వీడియో లు తీసి సామజిక మాధ్యమాల్లో షేర్ చేస్తాడు అల్లు అర్జున్. అదే విధం గా అల్లు అర్హ వీడియోలు కూడా నెట్టింట అంతే వైరల్ అవుతూనే ఉంటాయి.

Allu Arha
Allu Arha

అల్లు మనవరాలు సోషల్ మీడియాకే పరిమితం కాకుండా వెండి తెర పైన విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యింది. గుణశేఖర్ దర్సకత్వం లో సమంతా రూత్ ప్రభు ప్రధానపాత్రలో నటిస్తున్న”శాకుంతలం” సినిమా లో నటించింది. ఈ ఐదేళ్ల చిన్నారి అర్హ వయసుకు మించి అద్భుతమైన నటన తో మెప్పించింది. ఈ మాటలు స్యయం గా సమంతా నే వెల్లడించింది.

ఇదిలా ఉంటే అల్లు అర్హ ఒక అరుదైన రికార్డ్ సృష్టించింది. తన పుట్టిన రోజున తల్లిదండ్రులయిన అల్లు అర్జున్ కి స్నేహా రెడ్డిలకు మర్చిపోలేని గిఫ్ట్ ని ఇచ్చింది. అత్యంత పిన్న వయస్సులోనే చెస్ లో శిక్షణ ఇస్తూ భళా అనిపించింది. ఈ క్రమంలోనే అతి తక్కువ వయస్సులో ప్రఖ్యాత నోబుల్ అవార్డుని పొందింది. ఒక చెస్ అకాడెమీ లో శిక్షణ పొందిన అర్హ ఇతరులకి చెస్ నేర్పించడం ప్రారంభించింది. ఇలా రెండు మాసాల్లోనే యాభై మందికి పైగా చెస్ లో శిక్షణ ఇచ్చింది.

దీంతో అసామాన్య ప్రతిభ ని కనబరిచిన అల్లు అర్హ కి నోబుల్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ ప్రతినిధులు ఒక పరిక్ష ని నిర్వహించారు. ఇందులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది అల్లు అర్హ. దీంతో అల్లు అర్హ కి వరల్డ్ యంగెస్ట్ చెస్ ట్రైనర్ అవార్డు లభించింది. ఈ పరీక్షకి సంబంధించిన వీడియో ని అల్లు స్నేహ రెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా లో షేర్ చేసి తమ ఆనందాన్ని వెల్లడించింది. అయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యింది. అయితే తన పుట్టిన రోజున తల్లిదండ్రులకి మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చింది అర్హ.

 

NVN Ravali
NVN Ravali
Ravali is a Entertainment Content Writer, She Writes Articles on Entertainment and TV Shows.
RELATED ARTICLES

Most Popular