
Allu Arjun : అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తనను బ్లాక్ చేశాడంటూ హీరోయిన్ భానుశ్రీ మెహ్రా రచ్చకెక్కింది. ఆమె ట్వీట్ వైరల్ గా మారింది. 2010లో విడుదలైన వరుడు మూవీ డిజాస్టర్ టాక్ అందుకుంది. భారీ హైప్ మధ్య విడుదలైన ఈ చిత్రం ఏమాత్రం అంచనాలు అందుకోలేదు. దర్శకుడు గుణశేఖర్ భారీ బడ్జెట్ తో వరుడు తెరకెక్కించారు. కోలీవుడ్ హీరో ఆర్య విలన్ రోల్ చేశారు. అప్పట్లో వరుడు సినిమా హీరోయిన్ మీద పెద్ద చర్చ నడిచింది. కారణం… విడుదల తేదీ వరకు హీరోయిన్ ఎవరనేది రివీల్ చేయలేదు. ఈ మూవీలో హీరో-హీరోయిన్ ఒకరినొకరు చూసుకోకుండా నేరుగా పెళ్లి పీటల మీదే చూసుకోవాలి అనుకుంటారు.
ఆ కాన్సెప్ట్ కి అనుగుణంగా హీరోయిన్ లుక్ రివీల్ చేయలేదు. దీంతో ఎవరా హీరోయిన్ అనే ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమా ప్రమోషన్ కి ఇది బాగా ఉపయోగపడింది. ఆ చిత్ర హీరోయిన్ భానుశ్రీ మెహ్రా. వరుడు ఆడకపోవడంతో భానుశ్రీ మెహ్రాకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్స్ రాలేదు. అడపాదడపా సినిమాలు చేసినా బ్రేక్ రాలేదు. కాగా భానుశ్రీ మెహ్రాను హీరో అల్లు అర్జున్ ట్విట్టర్లో బ్లాక్ చేశాడట. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
https://twitter.com/IAmBhanuShree/status/1636984685321416705?s=20
అల్లు అర్జున్ నన్ను బ్లాక్ చేశారు. నేను ఆయనతో వరుడు చిత్రంలో నటించాను. నాకు పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు. కష్టాల్లో కూడా నేను ఆనందం వెతుకున్నాను.. అని ట్వీట్ చేశారు. అలాగే అల్లు అర్జున్ బ్లాక్ చేసినట్లు ఆధారంగా చూపుతూ స్క్రీన్ షాట్ షేర్ చేశారు. మరొక ట్వీట్లో అల్లు అర్జున్ నన్ను అన్ బ్లాక్ చేశారు. అల్లు అర్జున్ మీకు ధన్యవాదాలు. నా ఫెయిల్యూర్స్ కి అల్లు అర్జున్ ని బ్లేమ్ చేయలేదు. కష్టనష్టాలు అధిగమిస్తూ ఆనందంగా ముందుకు వెళుతున్నాను… అని కామెంట్ పెట్టారు.
Great news, Allu Arjun has unblocked me! To clarify, I NEVER blamed him for my career setbacks. Instead, I've learned to find humor in my struggles and keep moving forward. Stay tuned for more laughs and good vibes! Thanks, Allu Arjun, for being a good sport. @alluarjun pic.twitter.com/oLovQdnWAE
— Bhanushree Mehra (@IAmBhanuShree) March 18, 2023
అసలు అల్లు అర్జున్ ఆమెను ఎందుకు బ్లాక్ చేశాడనేది పెద్ద ప్రశ్నగా మారింది. కారణం లేకుండా ఒక స్టార్ హీరో అలా చేయరు కదా? అల్లు అర్జున్-భానుశ్రీ మెహ్రా మధ్య ఏం జరిగింది? అనే చర్చ మొదలైంది. భానుశ్రీ మెహ్రా ఇప్పుడు ఫార్మ్ లో లేదు. వీరిద్దరు మళ్ళీ చిత్రం చేసింది లేదు. మీరు దీని వెనుకున్న సంగతి ఏంటనేది.. ఆమెనే చెప్పాలి. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు.