
Allari Naresh Ugram Teaser Review: కామెడీ చిత్రాల హీరోగా అల్లరి నరేష్ టాలీవుడ్ పై తన మార్క్ వేశారు. ఈ తరం రాజేంద్రప్రసాద్ అనిపించాడు. అల్లరి నరేష్ అరంగేట్రమే కామెడీ హీరోగా మొదలైంది. అంటే ఆయన ఈ జోనర్లో ఎదగాలని నిర్ణయించుకొని అడుగుపెట్టాడు. సక్సెస్ అయి చూపించాడు. అనతి కాలంలో 50 సినిమాలు పూర్తి చేసిన హీరో అల్లరి నరేష్. ఏడాదికి నాలుగైదు సినిమాలు విడుదల చేసేవారు. మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఎంత సక్సెస్ ఫుల్ హీరో అయినా ఒకే జోనర్లో సినిమాలు చేస్తే కొన్నాళ్లకు మొనాటమి వచ్చేస్తుంది. అదే అల్లరి నరేష్ కి మైనస్ అయ్యింది.
ఆయన కామెడీ చిత్రాలను జనాలు పట్టించుకోవడం మానేశారు. ఏం చేయాలో అర్థం కాక సందిగ్ధంలో పడ్డ నరేష్, సీరియస్ సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నారు. వరుసగా ఆయన అదే తరహా చిత్రాలు చేస్తున్నారు. నాంది, ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం సోషల్ బర్నింగ్ టాపిక్స్ నేపథ్యంలో తెరకెక్కాయి. నాంది పాజిటివ్ టాక్ తెచ్చుకోగా, ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం ఆకట్టుకోలేదు.
తాజాగా మరోసారి ఆయన సీరియస్ సబ్జెక్ట్ ఎంచుకున్నారు. ఈసారి పోలీసు పాత్రలో బీభత్సం చేసేందుకు సిద్ధమయ్యారు. ఉగ్రం టైటిల్ తో తెరకెక్కిన చిత్రంలో అల్లరి నరేష్ పవర్ ఫుల్ పోలీస్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్ర టీజర్ విడుదలైంది. అల్లరి నరేష్ గతంలో ఎన్నడూ చూడని కొత్త కోణం పరిచయం చేశారు. ఒక అంకుశం రాజశేఖర్, పోలీస్ స్టోరీ సాయి కుమార్ లను గుర్తు చేశారు. యాక్షన్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గలేదు. ఫైట్స్ దుమ్మురేపాడు.

ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీని విలన్స్ డిస్టర్బ్ చేస్తే అతడి రియాక్షన్ ఎలా ఉంటుందనేదే ఉగ్రం మూవీ. అల్లరి నరేష్ గెటప్ గూస్ బంప్స్ కలిగించింది. కమర్షియల్ హిట్ కొట్టాలని అల్లరి నరేష్ కసితో చేసినట్లు అర్థం అవుతుంది. ఆయనతో నాంది చిత్రం చేసిన విజయ్ కనకమేడల ఉగ్రం తెరకెక్కిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలుగా ఉన్నారు. అల్లరి నరేష్ కి జంటగా మీర్నా నటిస్తున్నారు. ఉగ్రం చిత్రానికి శ్రీచరణ్ పాకల మ్యూజిక్ అందిస్తున్నారు. టీజర్ ఆసక్తి రేపుతున్న నేపథ్యంలో ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.