
Samantha: సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.కొన్ని విషయాల మీద ఆమె నిర్మొహమాటంగా స్పందిస్తారు. నాగ చైతన్యతో విడాకులు అయ్యాక సమంత ఆయన్ని పరోక్షంగా టార్గెట్ చేశారు. కొన్ని సందర్భాల్లో నేరుగానే కోపం ప్రదర్శించారు. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ నాగ చైతన్యను మీ భర్త అని సంబోధించగా మాజీ భర్త అని సమంత నొక్కి చెప్పారు. ఇప్పుడు ఒకే గదిలో ఇద్దరినీ ఉంచాల్సి వస్తే అక్కడ కత్తులు కూడా పెట్టాలి అని అన్నారు. ఇటీవల నేను వైవాహిక జీవితంలో వంద శాతం నమ్మకంగా ఉన్నాను. అయినా అది వర్క్ అవుట్ కాలేదని సమంత నాగ చైతన్యను ఉద్దేశించి అన్నారు.
నాగ చైతన్య మాత్రం పూర్తి సైలెన్స్ పాటించారు. తాజాగా శాకుంతలం మూవీ ఫెయిల్యూర్ మీద కూడా సమంత ఓపెన్ గా స్పందించడం ఆసక్తి కలిగిస్తుంది. శాకుంతలం సమంత కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిపోయింది. రూ. 50-60 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి. సమంత మూవీ అంటే కనీస ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటిది శాకుంతలం ఆడుతున్న థియేటర్స్ వైపు వెళ్లేందుకు ప్రేక్షకులు భయపడుతున్నారు.
సమంత ఇమేజ్ కొంత మేర దెబ్బతింది. శాకుంతలం మూవీలో ఆమె నటన సంగతి అంటుంచితే… డబ్బింగ్ కలవరానికి గురిచేసిందని మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం. పౌరాణిక చిత్రానికి తెలుగు రాని సమంత చేత డబ్బింగ్ చెప్పిన దర్శకుడు గుణశేఖర్ నిర్ణయానికి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ కళాఖండం గురించేనా ప్రమోషన్స్ లో ఈ రేంజ్ లో చెప్పారని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.

శాకుంతలం చిత్రం మీద సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండగా సమంత స్పందించారు. ఆమె భగవద్గీత శ్లోకంతో విమర్శలకు సమాధానం చెప్పారు.
‘కర్మణ్యే వాధికా రాస్తే
మా ఫలేషు కదాచన
మా కర్మ ఫల హే తుర్ భూః
మా తే సంగోస్త్వకర్మణి…’ అని ఇంస్టాగ్రామ్ లో కామెంట్ పోస్ట్ చేశారు. కర్మలు చేయడమే మన పని వాటి ఫలితం మన చేతుల్లో ఉండదు. ఫలితం ఏదైనా కర్మలు చేయడం మానరాదని ఆ శ్లోకం అర్థం. శాకుంతలం చిత్రాన్ని ఓ ప్రయత్నంగా తీశాము. అది ప్రేక్షకులకు నచ్చలేదు. అలా అని మా ప్రయాణం ఆగదని సమంత విమర్శకులకు సమాధానంగా చెప్పారు.
View this post on Instagram