Baba Movie Re Release: సెప్టెంబర్ 2 వ తారీఖున పవన్ కళ్యాణ్ ఫాన్స్ తమ అభిమాన హీరో పుట్టినరోజు కానుకగా చరిత్రలో చెరిగిపోని రికార్డు ని నెలకొల్పారు..ఆయన కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన జల్సా సినిమాని స్పెషల్ షోస్ గా ప్రపంచవ్యాప్తంగా వేసుకున్నారు..సుమారుగా 750 షోస్ ప్రదర్శితం గా 3 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది..ఈ సినిమా స్పెషల్ షోస్ కి ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు పోకిరి సినిమా స్పెషల్ షోస్ వేసుకున్నారు.

ఈ షోస్ నుండి కోటి 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఈ రికార్డుని ఎవ్వరు కొట్టలేరని మహేష్ బాబు ఫాన్స్ అప్పట్లో తొడలు కొట్టారు కానీ..నెల తిరగకముందే పవన్ కళ్యాణ్ ఫాన్స్ డబుల్ మార్జిన్ తో కొట్టి ఆల్ టైం ఇండియన్ రికార్డు ని నెలకొల్పారు..ఈ సినిమా తర్వాత ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలు స్పెషల్ షోస్ పడ్డాయి మరియు రీ రిలీజ్ లు జరిగాయి.
ప్రభాస్ నటించిన బిల్లా , రెబెల్ మరియు వర్షం..ఎన్టీఆర్ నటించిన ‘బాద్ షా’ మరియు బాలయ్య బాబు నటించిన చెన్నకేశవ రెడ్డి, చిరంజీవి నటించి ఘరానా మొగుడు చిత్రాలు రీ రిలీజ్ అయ్యాయి..కానీ ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ ‘జల్సా’ స్పెషల్ షోస్ గ్రాస్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి ఈ చిత్రాలు..ఇది ఇలా ఉండగా సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిన చిత్రం ‘బాబా’..ఈ సినిమా ని డిసెంబర్ 12 వ తేదీన రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.

విశేషం ఏమిటంటే ఈ రీ రిలీజ్ లో అప్పట్లో సరికొత్త సన్నివేశాలను జతచేసి విడుదల చేయబోతున్నారట..సినిమాలో ఉన్న బోరింగ్ సన్నివేశాలను తొలగించి, మంచి సీన్స్ ని జతపర్చారట..ఈ సన్నివేశాలకు రజినీకాంత్ లేటెస్ట్ గా డబ్బింగ్ కూడా పూర్తి చేసాడు..కాబట్టి ఈ చిత్రం జల్సా స్పెషల్ షోస్ గ్రాస్ ని దాటి రీ రిలీజ్ లో ఆల్ టైం ఇండియన్ రికార్డు సృష్టిచిన సినిమాగా నిలుస్తుందో లేదో చూడాలి.


