Zodiac Signs On Holi: హోలీ తరువాత ఈ రాశుల వారికి అన్ని శుభాలే?

Zodiac Signs On Holi: హోలీ పండుగ తరువాత రాశుల ఫలితాలు మారబోతున్నాయి. తొమ్మిది గ్రహాలు పన్నెండు రాశులపై గణనీయమైన ప్రభావాలు చూపనున్నాయి. ఇందులో బృహస్పతి స్థానం మార్పు వల్ల కొన్ని రాశులకు అదృష్టం కలిసి రాబోతోంది. ఫలితంగా వారికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో బృహస్పతి మార్పు వల్ల హోలీ తరువాత మూడు రాశుల వారికి మహత్తరంగా ఉండబోతోంది. రంగుల పండుగ హోలీ జీవితాల్లో కూడా రంగులు నింపనుందని వాస్తు పండితులు చెబుతున్నారు. […]

Written By: Srinivas, Updated On : March 6, 2023 12:31 pm
Follow us on

Zodiac Signs On Holi

Zodiac Signs On Holi: హోలీ పండుగ తరువాత రాశుల ఫలితాలు మారబోతున్నాయి. తొమ్మిది గ్రహాలు పన్నెండు రాశులపై గణనీయమైన ప్రభావాలు చూపనున్నాయి. ఇందులో బృహస్పతి స్థానం మార్పు వల్ల కొన్ని రాశులకు అదృష్టం కలిసి రాబోతోంది. ఫలితంగా వారికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో బృహస్పతి మార్పు వల్ల హోలీ తరువాత మూడు రాశుల వారికి మహత్తరంగా ఉండబోతోంది. రంగుల పండుగ హోలీ జీవితాల్లో కూడా రంగులు నింపనుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

Also Read: Honeymoon: హనీమూన్ జంటను సముద్రంలో వదిలేశారు.. తర్వాత ఏమైందంటే?

బృహస్పతిని దేవతల గురువుగా చెబుతారు. ఇతర గ్రహాల మాదిరిగానే బృహస్పతి సంచారం మనుషుల జాతకాలపై ప్రభావం చూపుతుంది. హోలీ తరువాత కొన్ని రాశులకు శుభ ఫలితాలు కలగనున్నాయి. ముఖ్యంగా మూడు రాశుల వారికి బృహస్పతి అదృష్టాన్ని పంచబోతున్నాడు. బృహస్పతి సంచారంతో మేష, కర్కాటక, మీన రాశుల జాతకులకు బాగా కలిసి వస్తుందని చెబుతున్నారు. గ్రహాలలో అత్యంత పవిత్రమైన గ్రహంగా బృహస్పతికి పేరుంది. బృహస్పతి చూపు ఇప్పుడు ఈ మూడు రాశులపైనే ఉండటం గమనార్హం.

మేష రాశి జాతకులకు బృహస్పతి 9వ, 12వ ఇంట సంచరించడం వల్ల హోలీ తరువాత బాగా కలిసి వస్తుంది. మేషరాశికి బృహస్పతి స్నేహితుడు కావడంతో అన్ని విధాలా లాభదాయకమైన ప్రయోజనాలు దక్కుతాయి. మేషరాశి వారికి హోలీ తరువాత పిల్లల గురించి శుభవార్తలు వింటారు. వివాహాలు కాని వారికి ఈ సమయంలో జరగడానికి ఆస్కారం ఉంది వివాహితుల జీవితాల్లో కూడా కొన్ని ఆసక్తికర మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కర్కాటక రాశి వారికి బృహస్పతి ప్రభావం వల్ల ఆరవ, తొమ్మిదో ఇంట బృహస్పతి ఉండటంతో ఉద్యోగ, వ్యాపారాల్లో పలు మార్పులు వస్తాయి. వ్యాపారస్తులకు మంచి కాలం. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. జీవితంలో సుఖంగా సాగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగి మానసిక ప్రశాంతత కలుగుతుంది. దీంతో ఈ రాశి వారికి హోలీ తరువాత మంచి ఫలితాలు కలిగేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

Zodiac Signs On Holi

హోలీ పండుగ తరువాత మీన రాశి వారికి కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి జాతకులకు బృహస్పతి 11వ ఇంటికి అధిపతిగా ఉంటున్నాడు. అందుకే పండుగ తరువాత మీన రాశి రెండో ఇంట్లో బృహస్పతి సంచరిస్తాడు. దీంతో ఈ రాశి వారికి ఇంట్లో డబ్బు స్థిరంగా ఉంటుంది. శత్రువులు అడ్డు రావడానికి ప్రయత్నించినా వారికి అనుకూలమైన పరిస్థితులు ఉండవు. వీరు మాత్రం దూసుకుపోతారు. ఇంట్లో వివాహాలు జరిగే అవకాశముంటుంది. బృహస్పతి సంచారంతో అన్ని శుభాలే కలుగుతాయి.

Also Read:Janhvi Kapoor: ఎన్టీఆర్ 30: జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ రివ్యూ…

Tags