Natu Natu : రష్మికతో ఆలియా భట్ ‘నాటు నాటు’.. వైరల్ వీడియో

Natu Natu : నాటు నాటు ఫీవర్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఈ పాట విడుదలై ఏడాది దాటింది. ఈ పాటకు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డు దక్కాయి. ఈ పాట రాసిన చంద్రబోస్, స్టెప్పులు వేసిన ప్రేమ్ రక్షిత్, పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కంపోజ్ చేసిన ఎంఎం కీరవాణి పై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది.. సన్మానాలు గట్రా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ పాట […]

Written By: Bhaskar, Updated On : April 2, 2023 12:24 pm
Follow us on

Natu Natu : నాటు నాటు ఫీవర్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఈ పాట విడుదలై ఏడాది దాటింది. ఈ పాటకు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డు దక్కాయి. ఈ పాట రాసిన చంద్రబోస్, స్టెప్పులు వేసిన ప్రేమ్ రక్షిత్, పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కంపోజ్ చేసిన ఎంఎం కీరవాణి పై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది.. సన్మానాలు గట్రా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ పాట సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ లోనే నిలుస్తోంది. యూ ట్యూబ్ లో కోట్ల కొద్దీ వ్యూస్ నమోదు చేస్తూనే ఉంది. అయినప్పటికీ ఈ పాట క్రేజ్ తగ్గడం లేదు.

ఇటీవల ఐపిఎల్ ప్రారంభ వేడుకల్లోనూ ఈ పాటకు రష్మిక మందన్న, తమన్నా స్టెప్పులు వేసి అదరగొట్టారు. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులను రజింపజేశారు. అంత కాదు వచ్చిన ఆటగాళ్లతోనూ నాటు నాటు స్టెప్పులు వేయించారు. దీంతో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం హోరెత్తిపోయింది. ప్రేక్షకులు ఈలలు వేస్తూ గోల చేయడంతో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. నాటు నాటు పాట ఐపీఎల్ ను మరో స్థాయికి తీసుకెళ్లిందని కితాబు ఇచ్చారు.

ఇక తాజాగా ఈ పాట గ్రేట్ ఇండియన్ మ్యూజికల్ ఫెస్టివల్ లోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నీతా ముకేశ్ అంబానీ కల్చర్ సెంటర్ లో నిర్వహించిన ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్ లాంచ్ ప్రారంభ వేడుకను హోరెత్తించింది. నాటు నాటు పాటకు నేషనల్ క్రష్ రష్మిక స్టెప్పులు వేసి అదరగొట్టింది. తన తో పాటు అలియా భట్ ను స్టెప్పులు వేసేలా చేసింది. దీంతో ఈ కార్యక్రమానికి హాజరైన అతిరథ మహారథులు మొత్తం పాదం కదిపారు. చివరికి ముకేశ్ అంబానీ కూడా చప్పట్లతో హోరెత్తించారు. నీతా అంబానీ కూడా సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ క్రేజ్ ఇప్పట్లో తగ్గదని వ్యాఖ్యానిస్తున్నారు.. నాటు నాటు పాట మరి కొన్ని సంవత్సరాల పాటు ప్రపంచాన్ని కూడా ఊపేస్తుందని జోస్యం చెబుతున్నారు. అంతటి ఆస్కార్ అవార్డు కమిటీ కూడా డ్యాన్స్ వేసింది అంటే.. ఈ పాటలో ఏదో మ్యాజిక్ ఉందని చెబుతున్నారు.. మామూలుగా రాసిన నాటు నాటు పాట ఈ స్థాయిలో గుర్తింపు తీసుకు వస్తుందని చంద్రబోస్ కలలో కూడా ఊహించి ఉండడు.