Akshay Kumar : నా సిటిజెన్ షిప్ ని వదిలేస్తున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరో

Akshay Kumar : బాలీవుడ్ లో బిగ్గెస్ట్ యాక్షన్ హీరో గా, అద్భుతమైన ఎంటర్టైనర్ గా సుమారు మూడు దశాబ్దాల నుండి తిరుగులేని స్టార్ హీరో గా కొనసాగుతున్న నటుడు అక్షయ్ కుమార్.బాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న టాప్ 5 స్టార్ హీరోలలో ఒకరు ఆయన.అంతే కాకుండా ఇండియా లో అత్యధిక సంపాదన ఆర్జిస్తున్న హీరోలలో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు అక్షయ్ కుమార్.ఆయన సినిమా విడుదలైంది అంటే టాక్ తో సంబంధం లేకుండా కనీస స్థాయి […]

Written By: NARESH, Updated On : February 24, 2023 9:28 pm
Follow us on

Akshay Kumar : బాలీవుడ్ లో బిగ్గెస్ట్ యాక్షన్ హీరో గా, అద్భుతమైన ఎంటర్టైనర్ గా సుమారు మూడు దశాబ్దాల నుండి తిరుగులేని స్టార్ హీరో గా కొనసాగుతున్న నటుడు అక్షయ్ కుమార్.బాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న టాప్ 5 స్టార్ హీరోలలో ఒకరు ఆయన.అంతే కాకుండా ఇండియా లో అత్యధిక సంపాదన ఆర్జిస్తున్న హీరోలలో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు అక్షయ్ కుమార్.ఆయన సినిమా విడుదలైంది అంటే టాక్ తో సంబంధం లేకుండా కనీస స్థాయి ఓపెనింగ్స్ వస్తాయి.

అందుకే ఆయనతో సినిమాలు తియ్యడానికి దర్శక నిర్మాతలు క్యూలు కట్టేస్తూ ఉంటారు.అంతే కాదు ఏదైనా విపత్తు వచ్చినప్పుడు అక్షయ్ కుమార్ రేంజ్ లో ఎవ్వరూ సహాయం కూడా చెయ్యలేరు,అంత మంచి మనసు ఆయన సొంతం.అయితే అక్షయ్ కుమార్ ని మొదటి నుండి బాలీవుడ్ లో ఒక వర్గం ట్రోల్ చేస్తుండేది ఏమిటంటే అతను మన ఇండియన్ కాదు అని.

అలా అతనిని ఎందుకు అంటారంటే 2019 వ సంవత్సరం లో ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని ఇంటర్వ్యూ చేస్తాడు.ఈ ఇంటర్వ్యూ లో ఆయన చివర్లో ప్రతి ఒక్కరు భారతదేశ పౌరులు అయ్యినందుకు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి అని అంటాడు.ఆయన అన్న ఈ మాట పెద్ద వివాదాలకు దారి తీసింది.ఎందుకంటే అక్షయ్ కుమార్ కి అసలు ఇండియా లో పౌరసత్వం లేదు,1990 వ సంవత్సరం లో ఆయన కెనడా లో పౌరసత్వం నమోదు చేసుకున్నాడు.ఇప్పుడు ఆ పౌరసత్వం రద్దు చేసి, ఇండియన్ సిటిజెన్ షిప్ తీసుకుంటాను అని, అందుకోసం పాస్ పోర్టు కి అప్లై చేయబోతున్నాను అంటూ అక్షయ్ కుమార్ తెలిపాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘1990ల్లో నాకు వరుసగా 15 ఫ్లాప్స్ వచ్చాయి..ఇక ఇండస్ట్రీ లో మనుగడ సాగించలేను..వేరే దేశానికీ వెళ్లి పని చేసుకోవడం బెటర్ అని భావించి కెనడా లో వేరే పని చేసుకోవాలని అనుకోని అక్కడి పౌరసత్వం తీసుకున్నాను..కానీ ఆ తర్వాతే నాకు రెండు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి.ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు..ఇండియా నాకు అన్నీ ఇచ్చింది.నేను ఇక్కడే టాక్సులు కడుతున్నాను.అందుకే ఇక్కడే నేను పౌరసత్వం తీసుకుంటాను’ అంటూ అక్షయ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడాడు.