
Suma – Akhil : ఈటీవీ లో ఎంటర్టైన్మెంట్ షోస్ కి కొదవే ఉండదు, ఒక విధంగా బుల్లితెర మీద ఎంటర్టైన్మెంట్ షోస్ ట్రెండ్ సృష్టించిందే ఈటీవీ ఛానల్ అని చెప్పడం లో ఎలాంటి అతిసయోక్తి లేదు.ఈటీవీ లో సుమ ఆద్వర్యం లో వచ్చే క్యాష్ ప్రోగ్రాం ఎంత పెద్ద భారీ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.ఈ షో కి బదులుగా ఇప్పుడు సుమా ‘అడ్డా’ అనే కార్యక్రమం ప్రసారం అవుతుంది.ప్రతీ శనివారం ప్రసారమయ్యే ఈ ప్రోగ్రాం కి టాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోలు మరియు హీరోయిన్స్ తమ సినిమాల ప్రొమోషన్స్ కోసం వస్తుంటారు.
అయితే ఈసారి మాత్రం స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ‘BB జోడి’ అనే కార్యక్రమం లో కంటెస్టెంట్స్ గా పాల్గొన్న జోడీలు హాజరయ్యాయి.అఖిల్, తేజస్విని తో పాటుగా అరియానా కూడా ఈ ప్రోగ్రాం లో పాల్గొన్నది.దీనికి సంబంధించిన ప్రోమోని ఇటీవలే విడుదల చెయ్యగా అది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఇందులో ప్రారంభం మొత్తం వినోదం తోనే నిండిపోయింది.సుమ ఉంటే ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కదా.ఆమె ఇచ్చిన చిన్న స్కిట్స్ ని బాగానే చేసి ఆడియన్స్ కి వినోదం ని పంచడానికి ప్రయత్నం చేసారు.కానీ చివర్లో అఖిల్ కి కోపం వచ్చి షో మధ్యలోనే వాక్ అవుట్ చెయ్యడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.సుమ ఒక స్కిట్ ఇస్తూ ‘నాకు కొన్ని వ్యాపారాలు ఉన్నాయి అన్నమాట..వాటిని ప్రారంభించడానికి అరియనా ని గెస్ట్ గా పిలిచాము’ అని అంటుంది.
అప్పుడు అరియనా రాగానే అఖిల్ ‘ఈమెని గెస్ట్ గా పిలవడానికి రెండు లక్షలు ఇచ్చావా’ అని సుమ ని అంటాడు.అప్పుడు అరియానా నువ్వు ఇచ్చే రెండు లక్షలకు నేనే ఎక్కువ అని అంటుంది.ఇక ఆ స్కిట్ అలా కొనసాగుతూనే తేజస్విని తో గొడవ అయ్యి నేను ఈ షో చెయ్యను అంటూ వాక్ అవుట్ అయ్యాడు.ఆ వైరల్ వీడియో ని మీరు కూడా క్రింద చూసేయండి.